Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఛీ. .ఛీ..ఇది పురపాలక శాఖేనా…?

ఛీ. .ఛీ..ఇది పురపాలక శాఖేనా…?

అవినీతికి కూడా హద్దులుండ వా…
అవినీతి తిమింగాళానికి ఆర్భాటం గా వీడ్కోలు. .
గంధం ప్రసాద్ కార్పొరేషన్ అతి పెద్ద అవినీతి తిమింగలం
జీతం లేకున్నా అక్రమ నిర్మాణాల కోసమే పనిచేశాడు…
పాపం అక్రమ నిర్మాణదారులంటే ఎంత ప్రేమో కదా. .
ఇంతటి అవినీతి అధికారికి అప్పుడే ఏళ్ళు నిండాయా…
ఆ హతవిధి…ఇంకెవరు ఈ అక్రమ నిర్మాణాలు కట్టిస్తారు..
చంద్రబాబు గారు గంధం ప్రసాద్ ను మళ్లీ కొనసాగించారా…
మీ విశేష అధికారంతో రిటైర్మెంట్ ఆపి ఉంటే బాగుండేదేమో..
ఇప్పుడు సిటీ ప్లానర్ కు దిక్కెవరు ..
అయ్యో వైసీపీ కార్పొరేటర్ల కు కాసులు ఎలా..
ఇక మీదట ఫ్యాన్ తిరగదు గా…
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోలేక పోయారే…
భవనిపురం వాసులు ఏమవ్వాలి..
వన్ టౌన్ వాసులు వసూళ్లు ఎవ్వరికీ ఇవ్వాలి..
అయ్యో ప్రసాద్ ఎంత పనిచేశావయ్యా…
భార్గవ్ ను ఒంటరిని చేస్తివే…
హోటళ్ల గదులు ఎవరికోసం ఎదురు చూడాలి…
ఆయన తెచ్చే పన్నీరు ఎవరు చల్లుకోవాలి…
భవనిపురం ఐరన్ షెడ్,ఇళ్ల అక్రమాలు ఎవరు చూడాలి..
ఎంత పని చేశావ్ గంధం ప్రసాద్..
జీతం వద్దుగా రిటైర్మెంట్ ఆపుకోలేక పోతివే..
ఇప్పటికి మించి పోయింది లేదు ఓ సారి ప్రయత్నం చేయవా…
సిగ్గులేని అవినీతి అధికారులు ఉన్నారు గా….
తూ మీ బ్రతుకులు చెడ మీరు అధికారులే నా…

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“అవును నిజం.. అవును నిజం.. అవును నిజం.. నీవన్నది..నీవన్నది.. నీవన్నది.. నీవన్నది, నిజం నిజం…చదువు వృధా.. వృధా.. వృధా…మనమంతా బానిసలం గానుగులం పీనుగులం..వెనుక దగా ముందు దగా, కుడి ఎడమల దగా దగా…మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె..మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె…నిజం సుమీ నిజం సుమీ, నీవన్నది నిజం సుమీ..” మహాప్రస్థానం లో శ్రీశ్రీ గారు అన్న విధంగా ఈ అవినీతి అధికారులను ఇంత కంటే నీచమైన భాష వాడలేము.
మనదీ ప్రజాస్వామ్య దేశం.ఈ ప్రజాస్వామ్య దేశం ఎన్ని ఆవినీతి పనులు చేసినా పట్టించుకునేవారు ఉండరు.
చివరికి ప్రజలే అవినీతి పరులుగా చిత్రీకరించబడతారు.ప్రజలకు ఉపయోగ పడటానికి చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు ఓటుకోసం వచ్చిన రోజు చూపించే ఆప్యాయత ప్రేమ అభిమానం సిరా చుక్క చేతికి అంటిన తరువాత వాటికి అడ్రెస్ లేకుండా పోతాయి.


అయ్యా అదేమిటని అడగాలంటే ఆమడ దూరం ఉండాలి. అదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ. సత్యానికి..అసత్యం అనే తాళం చెవితోతాళం వేసి బందిస్తున్నారు..న్యాయదేవత నిజాన్ని చూడకుండానల్లని గుడ్డతో కళ్లకి గంతలు కట్టారు..నిజం గొంతు చించుకుని అరిసిన వినపడకుండా అదే గుడ్డని చెవులకు కూడా కలిపి కట్టారుఇప్పుడు సత్యం పలకకుండా న్యాయదేవత నోటికి తాళంవేసి అసత్యం పలికిస్తున్నారు…సత్యం అసత్యంతో బంధింపబడి పుకార్లు చేస్తుంది….ఇదే నిజం… ఇదే నిజం… నిజం. ఎలా ఈ అక్షరాలు నిజం కాదో చెప్పే దమ్మున్న వారు కావాలి. గంధం ప్రసాద్ అనే వ్యక్తి విశాఖ కార్పొరేసన్, బెజవాడ కార్పోరేషన్ లలో టిపిఓ గా విధులు నిర్వహించారు. అతని పరిధిలో జరిగే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవలసి ఉంది. సరియైన పద్దతిలో అవి ఉన్నాయా లేదా లేకుంటే కార్పొరేషన్ కు చలానా కట్టించి అందంగా రుసుములు చెల్లించి అక్రమ నిర్మాణాలను సక్రమం చేసి అటు నిర్మాణ దారులకు ఇటు కార్పొరేషన్ కి మంచి జరిగేలా చూడాలి ఇది అతని ఉద్యోగ ధర్మం. అందుకు ఆ అధికారికి ప్రభుత్వం ప్రజల నుండి ముక్కుపిండి రాబట్టిన పన్నులలో నుంచి జీతాలు,ఇంక్రిమెంట్లు, అలవెన్స్లు ఇస్తారు. ఇది సాధారణంగా జరిగే తీరు. అయినా నీతి మాలిన అధికారులు చేతులు తడపందే పనులు చేయరు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. కానీ ఇక్కడ గంధం ప్రసాద్ అనే వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్నో అక్రమాలు చేసి చివరికి జీతం లేక పోయిన ఎంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసాడంటే అతని సర్వీస్ రికార్డ్ చూస్తే అర్ధమవుతుంది.విశాఖ, విజయవాడ కార్పొరేసన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించాడని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ వేసి నిగ్గుతేల్చి నోటీసులు ఇచ్చి జీతాన్ని ఆపేసింది.ఈ జీతం ఆగింది విశాఖ కార్పొరేషన్ లో..కానీ ఒక ఉద్యోగి బదిలీ 5 సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు… గంధం ప్రసాద్ మాత్రం అత్తారింటికి వెళ్లొచ్చిన చందంగా తిరిగి విజయ వాడ కార్పొరేషన్ కు బదిలీ చేయించు కున్నారు.

విశాఖ నుంచి విజయవాడ కు బదిలీ పై వచ్చే సందర్భంలో విశాఖ కార్పొరేషన్ నుంచి ఎల్పీసీ తీసుకుని రావాలి..కానీ అలా జరగలేదు కారణం అవినీతి ఆరోపణలు. సరే ఎల్ఫీసీ లేకుండానే విజయవాడ కార్పొరేషన్ కు బదిలీ అయ్యాడు ఓకే…ఇక్కడ ఎల్పీసీ లేని అధికారికి బాధ్యత ఇవ్వకూడదు.సరే ఉద్యోగం ఇచ్చారు…ఇస్తే ఆఫీస్ డ్యూటీ వేయాలి అది జరగలేదు. ఏకంగా రెండు డివిజన్ స్థాయిలో 22 డివిజన్ లు అప్పగించారు. ఇంకేముంది అప్పనంగా దోచుకోవడానికి ప్రవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్లాన్ ఇచ్చేది…ప్లాన్ తయారు చేసేది పక్కా ప్యాకేజీ తీసుకునే విదంగా పక్కా స్జెచ్ వేశారు.ఇందులో భాగంగా వన్ టౌన్ లో కబేలా సెంటర్ లో కరెంట్ ఆఫీస్ రోడ్ 3-1-295 డోర్ నెంబర్ లో గత అధికారులు తప్పుచేసారని స్వయాన సిటీ ప్లానర్ ప్రసాద్ బీల్డింగ్ కు కన్నాలు వేసి ఒక చిరు ఉద్యోగిని సస్పెండ్ చేసి ఇంకొక ఉద్యోగిని సరెండర్ చేసాడు… కానీ అవినీతి బాద్షా గంధం ప్రసాద్ రాగానే స్లాబ్ వేశారు..అంతా సక్రమే అయింది. ఇదెలా సాధ్యమో మరి ఈ అవినీతి అధికారులకె తెలియాలి.అదే కాకుండా భవాని పురం ఐరన్ యార్డ్ లో 76_18_356 డోర్ నెంబర్ ప్రక్కన షెడ్ ఎలాంటి చలానా లేకుండానే నిర్మాణం పూర్తి అయ్యింది. ఇది 43 వడివిజన్ లోనే.స్థానిక కార్పోరేటర్ వైసీపీ నే.అదే ఐరన్ యార్డ్ లో 76-18-354 లో ప్లాన్ ఇచ్చింది ఇండివిద్వల్ రెసిడెన్షియల్ కానీ అక్కడ నిర్మించింది కింద కమర్షియల్ మరి ఇదెలా సాధ్యమైంది. అలానే 42 డివిజన్ ప్రియాదర్శిని కాలనిలో 76-14-12లో ఓ నిర్మాణం జరుగుతోంది. రిటైర్డ్ అయ్యే లోపు దోచుకోవడానికి వెనుకాడని గంధం ప్రసాద్ లక్షల్లో లంచాలు తీసుకుని అక్రమాలు ప్రొస్టేహించి సొమ్ము చేసుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

అయితే ఈ అవినీతి లో సిటీ ప్లానర్ హస్తం పూర్తిగా ఉన్నట్లు వీరంతా ప్రవేటువ్యక్తులను ఉంచుకుని తమ కార్య కలాపాలు సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.గత వైసీపీ ప్రభుత్వం లో కార్పొరేసన్ స్తానం వైసీపీదే కావడం… మెజార్టీ కార్పొరేటర్ లు వైసీపీ వారే కావడం వారిలో కొంతమంది కి జగన్ ను చూసి ప్రజాభిమానం పొందడమే తప్ప వీరికి స్వతహాగా ప్రజల్లో పలుకుబడి నామ మాత్రమే. ఈ నేపధ్యంలో ఈ అవినీతి ప్రసాద్ జోడి కుదరడం తో స్థానిక కార్పొరేటర్లు కూడా కట్టడాల వెనుక భాగానే కుమ్మరించు కున్నట్లు బహిరంగంగానే అక్కడి ప్రజలే చెబుతున్నారు.భవానిపురం ఓ డివిజన్ లో ఓ విద్యుత్ ఉద్యోగి కార్పొరేటర్ కు కాసులివ్వలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఇదంతా అప్పటి మంత్రి వేలంపల్లి అండ దండలతోను అక్కడి కార్పొరేటర్ లు రెచ్చిపోయి గంధం తో కలిసి దోచుకున్నరన్నా ప్రచారం బాగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటి భాగోతాలు బోలెడు ఉన్నాయి. అయిన అవినీతి అధికారికి సిగ్గు ఎగ్గు లేకుండా రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగిన తీరు చూసి మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు.అవినీతి ప్రసాద్ కు అవినీతి కార్పొరేటర్ ల అండ దండలు, అక్రమ బిల్డర్లు అండగా నిలబడిన తీరు చూసి అవాక్కవతున్నారు అక్కడి ప్రజలు. చూడాలి మరి ఈ అవినీతి తిమింగలం చేసిన నీచ మైన పనులపై ఏమి చర్యలు తీసుకుంటారో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article