శభాష్ డైరెక్టర్ గారు…
జేడీ కస్తూరిపై వేటు…జిఎడికి బదిలీ…
సమాచార శాఖ ఇక బాగు పడినట్లేనా…
అధికారం శాస్వితం కాదని తెలిసిందా…
ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తే ఇలానే..
రూల్స్ అతిక్రమించినందుకు జేడీ కస్తూరి పై వేటు. .
నకిలీ అక్రెడిషన్ జారీలో చేతివాటం…
అనర్హులకు అక్రిడేషన్ లు ఇచ్చిన వైనం…
కమిషనర్ తుమ్మా ను తూచ్ చేసిన వైనం…
జగన్ జమానాలో ప్రత్యేక చాంబర్ ..
అనుకూల మీడియాకే రెడ్ కార్పెట్
యాడ్స్ ఇవ్వడం లో కూడాను….
గ్రూప్ లో యాడ్ చేయాలంటే ఆమె అనుగ్రహాఁ ఉండాల్సిందే…
నిజమైన వారికే రాజ్యాంగ అమలు…
అమ్మా నీ భాంచత్ అంటే చాలు…
నిజాలు మాట్లాడితే నిబంధనలు వర్తిస్థాయి…
ఇప్పటికయిన గ్రహణం వీడిందా..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
గ్రహణం వీడింది. ప్రజాస్వామ్య వ్యవస్థ విఘాతం కలిగించే విషయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.అందుకు ఆయానకు సెల్యూట్ చేయాల్సిందే.ఈ సమాజానికి మూలస్తంభాలలో నాలుగోవ స్తంభంగా పేరున్న పాత్రికేయ వృత్తికి మళ్లీ జీవం పోసినట్లైనది. కారణం ఎంతో మంది పాలకులు వచ్చారు కానీ ప్రజాకాంక్ష కు అవసరమైన మేరకు ఏమి చేయాలో చేశారు కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధాన పరమైన అంశాలపై కూడా అనాగద్రొక్కే సాహసం గత ప్రభుత్వం చేసింది.ఇది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కొంత అయితే ఆయన ఒకటి చేయమంటే ఇందులో కొంతమంది అవినీతి అధికారులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మితిమీరి ప్రవర్తించారని చెప్పక తప్పడం లేదు.అందుకు సజీవ సాక్ష్యాలుగా ఈ అధికారులు చేసిన తప్పిదాలు బోలెడు ఉన్నాయి . ముఖ్యంగా పత్రికలకు యాడ్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వాధినేత ఆదేశాలు ఆమలు చేయాల్సిందే కానీ ఆయనకు తెలియకుండా చేసిన తప్పిదాలకు ఎవరు మూల్యం చెల్లించుకున్నారు ఇప్పుడు. సత్యం ధర్మం అనేది ఎప్పుడు కూడా మసక బారదు.ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనలో మార్పులు చేస్తారు. అధికారుల బదిలీలు ఉంటాయి.అందులో భాగంగా సమాచార శాఖ కమిషనర్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు.అలా కమిషనర్ వచ్చాడో లేదో జాయింట్ డైరెక్టర్ కస్తూరి రంగంలోకి దిగింది.తుమ్మా విజయకుమార్ రెడ్డి ని కలవాలంటే ముందుగా ఈ అధికారిని మొక్కవలసి వచ్చేది.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జాయింట్ డైరెక్టర్ కిరణ్ ఉన్నా ఇంతలా చేయలేదు.వైసీపీ ప్రభుత్వం వచ్చింది సంతోసించండి ఏకంగా చాంబర్ మార్పు చేసుకొని పెత్తనం చేలాయించింది.ఫలితంగా గత ఐదేళ్ల పాపాలు వెంటాడక తప్పడం లేదు.మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అయితే తన పదవి కాలాన్ని పొడిగించాలని అభ్యర్ధన పెట్టి ఫలితాలు వచ్చాయో లేదో బాబు నేను ఇప్పుడే పోతా మాకొద్దు ఈ సమాచారశాఖ అని అభ్యర్థన పెడితే ఆ అబ్యర్ధన ఇంకా అబ్సెర్వట్ అవుతూనే ఉంది. ఆ విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నడో తెలియడం లేదు.ఏ పోస్ట్ ఇస్తారో ఏ విచారణ లో సస్పెండ్ చేస్తారో. అసలు జైలుకు పంపుతారో అంతా చంద్రన్న దయ మీద ఆధారపడి ఉంది. ఇక పోతే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా నియంత్రణ విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని అభినందించాలి.రాజ్యాంగం లో ఉన్న జీవో లను వెతికి మరి తెచ్చి మీడియా అక్రిడేషన్ల పై ఉక్కు పాదం మోపాడు.ఆయన ఉక్కు పాదం ఏమయిందో తెలియదు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా స్వతహాగా జర్నలిజం లో ఉన్నవారికి ఉరి అయ్యింది ..ఏమి లేని వారికి నకిలీలకు తుక్కు పాదం అయింది ఆఖరికి సమాచార శాఖ లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ల్ కూడా అక్రిడేషన్ లు ఇచ్చినట్లు తెలిసి మేడమ్ కస్తూరి గారు ఇవి నకిలీ అక్రిడేషన్ లు అవునా కాదా మీ కార్యాలయంలో ఇలా జరిగిందని తెలిపితే అంతా తూచ్ సమాధానం లేదు.ఎస్ ఆర్ నో కూడా తెలియదు. సరే మౌనం అర్డంగీకారమని పేద్దలు అన్నారు కదా అని అరా తీస్తే అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నకిలీ అక్రిడేషన్ లు అన్నీ ఇన్ని కావని తెలిసింది.ఏలూరు వెల్డర్ గాడితో మొదలు పెడితే తాపీ మెస్త్రీ బీల్డింగ్ రిపోర్టర్ లకు ..ఇలా కాక వెటరన్ ఫ్రీలాన్స్ అబ్బో అక్రిడేషన్ లే అక్రిడేషన్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.ఈ నకిలీ అక్రిడేషన్ ల గోల్ మాల్ పై కొన్ని పత్రికలు ఘోరంగా కథనాలను వెలువరించాయి. వీటన్నటికి నాటీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, మీడియా రిలేషన్ జాయింట్ డైరెక్టర్ కస్తూరి మేడమ్ గారే అన్న వదంతులు ప్రముఖ టీవీ ఛానెల్స్ విస్తృతంగా ప్రసారం చేసాయి ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నాటి ప్రభుత్వ కుట్రలను ఒక్కొక్క టిగా బైటికి తీస్తుంటే పాపం విశ్వాసం గల ఓ వర్గం మీడియా చంద్రబాబు మంచి నాయకుడు అంటూనే ఇలాంటి అధికారులకు వంత పాడుతున్నారు.చూడాలి నూతన డైరెక్టర్ సమాచార శాఖ ను ఏ విదంగా ప్రక్షాళన చేస్తాడో మరి.