Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఛీ మీరేమి మనుష్యులు రా బాబు…

ఛీ మీరేమి మనుష్యులు రా బాబు…

బాధితుల గోడు వినిపించదా…
అవినీతి సొమ్మయితే దాచుకొంటారా..
అన్నాన్ని రోడ్ల పాలు చేస్తారా..
మీ నిర్లక్ష్యం ప్రభుత్వం మీదనా…లేక ప్రజల పట్లనా…
ప్రజల సొమ్ము తింటూ వారి నోట్లో దుమ్ముకొడతారా..
పాప పుణ్యాలు పనికిరావ..లేక మీకు లేవా..
ఈ కష్టం మీకే వస్తే…
దాతల సొమ్ము దారి పాలు చేస్తారా…
అనుభవించక తప్పదు కర్మ నీతి లేని అధికారులూ…
సీఎం ను చూసి సిగ్గుతెచ్చుకోండి…
సిగ్గుపడాలి ఈ సమాజం మిమ్మల్ని చూసి…
ఎందుకింత నిర్లక్ష్యం.. దేనికోసం మీ బాధ్యతారాహిత్యం…
దారి తప్పిన బాబు దార్శనికత …తప్పించిన తప్పుడు అధికారులు..
వీరికి తప్పక దండన వేయాల్సిందే…
లేదంటే వీరితోనే పెను ప్రమాదం

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
అన్నామో రామచంద్ర అన్న మొహం చూసి పట్టేడు అన్నం పెడితే ఆ సర్వేశ్వరుడు సకలము ఇస్తాడని పెద్దలు చెబుతుంటారు.ఇక్కడ ఆకలి అన్న వాడి కి అన్నము ఉన్నా అది దరిచేరడం లేదు.నీతి లేని అధికారులు, అలసత్వం,పేద ప్రజలన్న దయలేక,అపదలో ఉన్నవారి పట్ల అనువంత ఆప్యాయత లేని అధికారులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు తెచ్చిపెట్టిన అన్నాన్ని అందించడం లో నిర్ల్పిత చూపుతున్నారు. ఊహించని పెనుప్రమాదం సంభవించి వారు వీరు అనే తేడా లేకుండా ఒక్కసారిగా వరద ప్రమాదం లో మునిగిపోయారు. కళ్ళుమూసి తెరిచే లోపు కొంతమంది వరద ప్రవాహంలో కొట్టుకుని పోయారు. ఇంకొంతమంది నిరాశ్రయులయ్యారు.నిలువ నీడ లేకుండా త్రాగడానికి బురదనీరే తప్ప గ్రుక్కెడు మంచినీరు లేక విలవిలాడి పోతున్నారు. ఆఖరికి ఒక బాలింత రాలు పిల్లవాడికి గ్రుక్కెడు పాలు పట్టేందుకు కూడా వీలులేని పరిస్థితుల్లో ఉన్నారు.ఇలాంటి ఊహించని ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి కప్పుడు వరదల్లో తిరుగుతూ బాధితుల గోడు వింటూ భరోసా కల్పిస్తున్నారు.అందులో భాగంగా బాధితులకు ప్రాధమికంగా అవసరమైన నీళ్లు, పాలు,అన్నాన్ని ఏ రూపేణా సాధ్యపడితే ఆరూపం లో అందించి ఆకలి చావులు లేకుండా చూడాలని ఆదేశిస్తూ..మరో అబ్యర్ధన చేస్తున్నా కొంత మంది అవినీతి అధికారులు తమకు సహజంగా ఉన్న నీతిమాలినతనంతో నిస్సిగ్గుగా నీళ్ళపాలు చేస్తున్నారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం కేవలం రెండు నియోజకవర్గాలలో తిరుగుతూ నిత్యావసరాలు అందించేందుకు ఓ వైపు సీఎం చంద్రబాబు పర్యవేక్షణ లో కృషి చేస్తుంటే కింది స్థాయిలో అది జరగక పేద ప్రజల ఆర్దనాదాలు ఆనంతంగా వినిపిస్తున్నాయి.ఏడు పదుల వయస్సు దాటిన ముఖ్యమంత్రి ఏదో ఒక చోట కూర్చుని ఏరియల్ సర్వే ద్వారా ఏర్పాట్లు చూడచ్చు.కానీ ఇక్కడ అలా జరగడం లేదే. వయస్సు లెక్కచేయకుండా వరదల్లో ఏ రూటు ఎటుపోతుందో ఏ సందుల్లో ఏమి ఉందో అన్న సందేహం సెక్యూరిటికి ఉన్నా వారు వారిస్తున్నా ,ఓ వైపు విమర్శలు చేస్తున్నా ఏడు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఉంటూ ఎన్నో సమీక్షలు చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నా ఆయన శ్రమ బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతుందనే ఆవేదన వ్యక్తమవుతోంది.ఇలాంటి పరిస్థితి ఈ అవినీతి అధికారులకు ఎదురయ్యితే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలి. ప్రజల సొమ్ము తో జీతాలు తీసుకుంటూ అదే ప్రజల జీవితాలతో అడుకుంటే ఆ అనర్థానికి మూల్యం చెల్లించక తప్పదు.కర్మ అనేది ఎవ్వరిని వదలదు అనుభవించక తప్పదు వారి వారి పనులు బట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article