Monday, January 20, 2025

Creating liberating content

రాజకీయాలుజర్నలిస్టులకు సంఘాలు కూడా ఉన్నాయా…

జర్నలిస్టులకు సంఘాలు కూడా ఉన్నాయా…

ఉంటే సంక్షేమం చేస్తున్నాయా…సంక్షోభం సృష్టిస్తున్నాయా…
సంక్షేమం అంటే శాలువా, సన్మానాలు చేసుకోవడమా…
జర్నలిజం ముసుగులో ఏది జరుగుతున్నా చూడడం కూడా…
ఎవరి సంక్షేమం కోసం ఏ సంక్షేమం చేశారు..
అక్రిడేషన్ కమిటీలు అత్యున్నత స్థాయి లో ఆ.ఆ..నే కదా..
అసలు జర్నలిజం అంటే తెలిసినోళ్లు ఉన్నారా ..
జర్నలిజం వృత్తి ఏ దారిలో పోతుందో చూస్తున్నారా…
కూటి కోసం కేకలు వేస్తుంటే కన్నెత్తి చూస్తున్నారా…
తప్పుడు అధికారులపై రాస్తే తడబాటు దేనికీ ..
మీ తప్పులకు తానా తందాన అంటున్నారనా…
ఎవరి మెప్పు గొప్పల కోసం ఈ సంఘాలు…
మీ సంక్షేమమే చూసుకోండి…కాదనరు
సంస్కరిస్తున్నామని ,సమాజ శ్రేయస్సంటే సరిపోదనుకుంటా…
అసలు మీరే న్యాయ నిర్ణేతలు అయితే ఎలా…
మీ దాసోహానికి అందరూ దాసోహం అవ్వరుగా…
దాసోహం అన్నవారిని దరి చేర్చుకోండి…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలంగాలి వాటు గమనానికి కాలి బాట దేనికిగొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికియే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠంయే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గంఅడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినావేట అదే వేటు అదే నాటి కధే అంతానట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతాబలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండాశతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ”అని సిరివెన్నెల గారు రచించి పాడిన పాట ఎంతో స్ఫూర్తిని ప్రస్తుత పరిస్థితి ని గుర్తుచేస్తుంది.ఎందుకని ప్రశ్నిస్తారా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా వ్యవస్థ పూర్తిగా గడితప్పింది. స్వేచ్చా సమానత్వం అంటూ సోల్లు కబుర్లు చెప్పేవారు ముందు మనము సక్రమంగా నడుచుకుంటున్నామా లేదా అన్నది చూసుకోవాలి.ఇక్కడ వ్యక్తిగత సిద్ధాంతాలు,అభిమతాలు ఆలోచనలు, పోకడలు వేరు. వ్యక్తిగా మనము ఏ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు ఉండే సంస్థలు అవి రాజకీయ పార్టీలు కావచ్చు, కుల సంఘాలు మరే ఇతర సంస్థలు కావచ్చు వాటికి వ్యక్తి పూజా చేసుకుంటారో ,భజన చేసుకుంటారో చేసుకోండి దాన్ని విమర్శించే హక్కుగాని ఇంకొకటి అని అనడానికి అవకాశం లేదు..ఎవరైనా అలా అంటే అది తప్పుగా పరిగణనలోకి తీసుకోవాలి.అలా అన్న వారిపై ఏ చర్యలు చేపట్టినా తప్పులేదు.కానీ అందుకు భిన్నంగా జరిగితే దానిని ఏ విదంగా పరిగణనలోకి తీసుకుంటారు…ఇలాంటి విధానాల వల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది ఇక్కడ తలెత్తుతున్న సమస్య. జర్నలిజం అనేది సంఘటనలు, వాస్తవాలు, ఆలోచనలు, వ్యక్తుల పరస్పర చర్యపై నివేదికల ఉత్పత్తి పంపిణీ , రోజు వార్తల ద్వారా సమాజానికి కనీసం కొంత ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది.రిపోర్టేజ్ అనేది న్యూస్ రిపోర్టింగ్ విశ్లేషణతో సహా నిర్దిష్ట అంశం లేదా ఈవెంట్ యొక్క మొత్తం మీడియా కవరేజీని కొన్నిసార్లు సూచిస్తుంది. తటస్థ రిపోర్టేజ్ పరువు నష్టం,పరువు నష్టం దావాలకు వ్యతిరేకంగా ఒక సాధారణ న్యాయ రక్షణగా ప్రజాప్రతినిధులు గానీ సమాజం గుర్తించ దగ్గ వ్యక్తుల గురించి అది ప్రభుత్వ, ప్రవేటు అధికార,అనదికార వ్యవస్థలో నిరూపించబడని ఆరోపణలను ప్రచురించే వేసులు బాటు మీడియా కలిగి ఉంటుంది. ఇలా ఇప్పుడు జరుగు తుందా అంటే లేదని చెప్పాలి.లేదు జర్నలిజం అనేది అలానే ఉంది అంటే దానిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కచ్చితంగా ప్రస్తుతం లేకపోలేదు. మరి ఇన్ని ప్రామాణికాలు కలిగిఉన్న జర్నలిజంలో ఉన్న జర్నలిస్టుల కోసం జర్నలిస్టుల పేరుతో అది కుడా కేవలం జర్నలిస్టుల కోసమే ఉన్నామనే సంఘాలు ఎన్ని ఉన్నాయో తెలియని అయోమయంలో కొందరు జర్నలిస్టులు ఉన్నారు.ఉన్నారని ప్రజాభూమి భావిస్తుంది లేరని నిరూపిస్తే దిద్దుబాటు చేసుకుంటుంది. గతంలో ఎన్నో విపత్తులు వచ్చాయి ఎందరో జర్నలిస్టులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు… ఇలా గొంతెత్తి మొత్తుకునే ప్రజాభూమి కూడా భూమిలో ఏదో ఒక రోజు కలిసిపోక తప్పదు. ఇది లోకొత్తర ధర్మం. ప్రస్తుతం విజయవాడలో ఊహించని ప్రమాదం లాగా వరదలు బీభత్సం సృష్టించాయి.మరి ఈ విపత్తు లో కూటి కోసం కూలి పనులు చేసే వారు,కోట్లకు పడగలెత్తిన కొటేస్వరులు కలిసి పోయి గ్రుక్కెడు మంచినీరు, కాసింత బువ్వకోసం ఎదురు చూశారు.కొన్ని ప్రాంతాల్లో ఎదురుచూస్తున్నారు.ఈ ఇద్దరి మద్య జర్నలిస్టులు కుడా ఉన్నారు కొంతమంది వివరాలు మాత్రమే బైటికి వచ్చాయి.కొంతమంది వివరాలు రాలేదు.మరి అలాంటి జర్నలిస్టుల కోసం దేశ రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టుల కోసం కృషి చేస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్,ఐపిఎస్ లకు పూల బోకేలు,సాలువలు కప్పి సెల్ఫీ లు దిగి పలు పత్రిక లలో రాయించుకుని ప్రచారం చేసుకున్న మహనీయులు ఇప్పుడే మయ్యారన్నది ప్రధాన ప్రశ్న.ఇంకొన్ని సంఘాలు అయితే కుటుంబాలను కలుపుకుని సమాచార డైరెక్టర్ ను కలిసి మా సంఘం చరిత్ర చూస్తే కళ్ళు చెదిరి పోతాయి..మేము సభ్యత్వానికి, డైరీకీ రేషన్ మిల్లర్ల దగ్గర నుంచి అక్రమ రేషన్ వ్యాపారస్తుల నుంచి ముక్కుపిండి వసూలు చేసి దండుకుంటాం.ఈ విషయాలు తెలిసి కామెంట్ చేస్తే అడ్రెస్ ల కోసం వెతుకుతాము,కాబట్టి మాకు అక్షర ముక్క రాదు,మాకు జర్నలిజం ముసుగులో ఉన్న నేషనల్ జర్నలిస్టు లనే యర్నలిస్ట్ లు ఉన్నారు.. నకిలీ అక్రిడేషన్ తీసుకుని పొద్దున్నే లేచింది మొదలు కలెక్షన్ కోసం తిరిగే ఏలూరు బొడిగుండోడు లాంటి ఫేక్ గాళ్ళు ఉన్నారని చెప్పుకుంటు న్నారు.మరి ఇప్పుడేమయ్యారు ఆ మహనీయులు ఎక్కడ సంక్షేమం కోసం సందుల్లో దూరారో లేక వరదల వల్ల రాబడి తగ్గి సంక్షోభంలో ఉన్నారో మరి తెలియని పరిస్థితి. ఇలా చెప్పుకుంటు పోతే బోలెడు ఉన్నాయి.మరి ఇలాంటప్పుడు సంఘాల తీరును చూసి నిరసన తెలియజేయడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు కొందరు జర్నలిస్టులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article