గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి.
దిగు ప్రాంతాలకు వణుకు పుట్టిస్తున్న ఏలేరు వరద
ప్రజా భూమి ప్రతినిధి ఏలేశ్వరం
ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఆవలి క్యాచ్ మెంట్ ఏరియాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ జలాశయంలోనికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుందని ఏలేరు జలాశయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం భాస్కరరావు సోమవారం సాయంత్రం తెలిపారు. పూర్వపు విశాఖ తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలలో భారీ వర్షాలు పడడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం 12 గంటలకు 35 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులో వస్తున్న సందర్భంలో 16,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తామన్నారు. అనంతరం సాయంత్రం వచ్చేసరికి వరద ఉధృతి ప్రాజెక్టులోకి 46 వేల 275 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడం తో దిగువ ప్రాంతాలకు 25275 క్యూసెక్కుల నీటిని సాయంత్రం 7 గంటలకు విడుదల చేయడం జరిగిందన్నారు. వరద ఉద్ధృనిబట్టి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దిగు ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. లోతట్టు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కిర్లంపూడి ప్రత్తిపాడు ఏలేశ్వరం సామర్లకోట పిఠాపురం గొల్లప్రోలు యు కొత్తపల్లి కాకినాడ రూరల్ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ఉధృతి ఇంకా పెరిగితే మరింత వరద నీటిని ఇగో ప్రాంతాలకు విడుదల చేసే అవకాశం ఉందని ఏలేరు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం భాస్కర్ రావు తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టులో పూర్తి నీటి సామర్థ్యం 24 పాయింట్ 11 టిఎంసిలతో 86.56 మీటర్లతో ఉండవలసి ఉంది ఉండగా వరద ఉధృతిని బట్టి ప్రాజెక్ట్ అధికారులు 23.23 టి.ఎం.సి లతో అనగా 86.13 మీటర్ల ప్రాజెక్టులో నీటి నిల్వలో సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. డి సి ఆర్ స్లు ఇస్ ద్వారా 600 క్యూసెక్కులు స్పిల్ వే రెగ్యులేటర్ ద్వారా 24400 క్యూసిక్కులు ఏలేరు ఎడమకాల ద్వారా 275 క్యూసెక్కులు ఏలేరు ప్రాజెక్టు నుండి విడుదల చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. ఇటు ప్రాజెక్ట్ అధికారులను వణుకు పుట్టిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై రామవరం అడ్డతీగల, రాజవొమ్మంగి, కొయ్యూరు గూడెం కొత్త వీధి చింతపల్లి మఠం భీమవరం పాతకోట ధారకొండ ధారలోవ దుమ్ముకొండ గుత్తేడు తదితర అటవీ ప్రాంతాల నుండి జడేరు మడేరు పెద్దేరు మద్ది గడ్డ వంటి ప్రాంతాలలో నుండి ఏలేరు జలాశయంలోనికి భారీ స్థాయిలో వరద నీరు వస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులతో సమన్వయమై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉగ్రరూపాన్ని దాల్చాయి. దీంతో ఏలేరు జలాశయంలోకి వచ్చి చేరే వరద నీరు గంట గంటకు పెరిగిపోతుంది.దీంతో అధికారులు అప్రమత్తమై రిజర్వాయర్ అధికారులు ఏడు గేట్లను ఎత్తి దిగువకు 25 వేల క్యూసెక్కుల పైనే అదనపు జలాలను అధికారులు విడుదల చేస్తున్నారు. నిండుకుండలా మారిన ఏలూరు జలాశయం లోకి వరద నీరు ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా చేరుతుండడం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది . లోతట్టు ప్రాంత ప్రజలు ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు . ఇప్పటికే పలు మండలాలలోని గ్రామాలు వరదమొప్పుకి గురై ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు ఆ ప్రాంత రైతులు ప్రజలు తెలిపారు.