కాకినాడ:
ఏలేరు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పెరుగుతోందని, జిల్లా అధికారులు నిరంతరం అప్రమ త్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏలేరుకు వస్తున్న వరదతో అప్రమత్తమై, ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాల న్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులోని జగనన్న కాలనీలను పవన్ కళ్యాణ్ సందర్శించిన అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్మీ సిబ్బంది, ఎస్‌డీఆర్ ఎఫ్‌తో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలకు అందుబా టులో ఉండ డాలన్నారు.పిఠాపురం నియోజకవర్గం పరిధిలో సీతానగరం, మల్లవరం, రమణక్కపేట, లక్ష్మీపురం గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ముంపు బాధితులకు అవసరం అయ్యే వారికి సహాయక చర్యలు, నిత్యావసరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా, వర్షాలతో ప్రాజెక్టులోకి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా అధికారులను పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు.వరద ప్రభావం ఉంటుందని నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచాలని అధికారులకు పవన్ కు సూచించారు. 2124 మెట్రిక్ టన్నుల బియ్యం, 202 మెట్రిక్ టన్నుల పంచదార, పామాయిల్ లీటర్, అర లీటర్ ప్యాకెట్లు 24 వేల ప్యాకెట్లు సిద్ధంగా ఉంచినట్లు డిప్యూటీ సీఎంకు తెలిపారు. కీలక సమయాల్లో విద్యుత్ అధికారులు ఎవరూ సెలవులు పెట్టకుండా విధుల్లో ఉండి, ఎక్కడ కరెంట్ అంతరాయం వచ్చినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నారు. వరద నీటితో తాగునీరు కలుషితం అయ్యే చాన్స్ ఉందని, క్లోరినేషన్ చేస్తున్నారు. ఆ తరువాతే గ్రామాల్లో రక్షిత మంచినీరు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వంద ముంపు సమయాల్లో ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని పవన్ కళ్యాణ్ కు జిల్లా అధికారులు తెలిపారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారనీ, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.