భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో దేశానికి రెండు పతకాలు సాధించడం తన జీవితంలో ఒక గొప్ప అనుభవమని వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మను, ఒలింపిక్స్ వేదికపై నీరజ్ చోప్రాతో తనకు జరిగిన సంభాషణ గురించి వివరించారు. ఆ సందర్భం తనకు ఎంతో ప్రత్యేకమని, అతడితో ఆటగాళ్లపై ఉండే ఒత్తిడి, సవాళ్ల గురించి మాట్లాడినట్టు చెప్పింది. నీరజ్ విజయాలు సాధించిన అథ్లెట్‌గా ఎంతో స్పూర్తిదాయకుడని, అతనితో మాట్లాడటం తనను ప్రభావితం చేసిందని మను భాకర్ చెప్పారు.మునుపటి పతకం సాధించిన క్షణం తన జీవితంలో సంతోషకరమైన సందర్భమని, తన కుటుంబం, స్నేహితుల సహకారం వల్లే ఆ విజయాన్ని సాధించానని చెప్పారు. మను తన రోజువారీ జీవితంలో యోగా, శిక్షణ, మరియు వ్యక్తిగత, క్రీడల జీవితానికి సమతుల్యాన్ని పాటించడంపై దృష్టి పెడతానని చెప్పారు. షూటర్ కాకపోతే టీచర్‌గా సెటిల్ అయ్యేదానినని, పిజ్జా తనకు ఇష్టమని కూడా వెల్లడించారు. చివరగా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన రోల్ మోడల్ అని వెల్లడించారు.