కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదు
వైసీపీ చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు
రాజధానిలో కాలువలు,రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ
గతంలో నిర్మించిన ఐకానిక్ భవనాలు,క్వార్టర్లు కు ఎలాంటి ఇబ్బంది లేదని ఐఐటి నిపుణులు నివేదిక
మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ:గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు..అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉందని,ఎలాంటి ఇబ్బందీ లేదన్న మంత్రి…భవిష్యత్తులో కూడా ఎలాంటి దుష్ప్రచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.విజయవాడలోని CRDA ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.అమరావతికి ముంపు లేకుండా రిజర్వాయర్లు,కాల్వల నిర్మాణంఅమరావతి రాజధానికి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచబ్యాంకు కు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రా…కృష్ణా నదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు..అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు,రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశాము.కొండవీటి వాగు,పాల వాగు ల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైవ్ చేశామని మంత్రి చెప్పారు..వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తాం.అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు,దొండపాడు నుంచి కృషాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాల వాగు,వైకుంఠపురం గ్రావిటీ కెనల ను 8 కిమీ మేర అభివృద్ధి చేస్తామన్నారు..మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తాం.వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కూచించుకుపోయిందన్నారు. గత వండేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.వీటితో పాటు 6 రిజర్వాయర్లు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు..సీడ్ కేపిటల్ లోపలనీరు కొండ వద్ద 0.4 టీఎంసీలు,కృష్ణాయపాలెం వద్ద 0.1టీఎంసీ లు,శాఖమూరు వద్ద 0.01టీఎంసీలు సామర్థ్యంతో రిజర్వాయర్లు,సీడ్ కేపిటల్ వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీ లు,పెద పరిమి వద్ద 0.2 టిఎంసి ల,వైకుంఠపురం వద్ద 0.3 టిఎంసి ల సామర్థ్యం తో మొత్తం 6 రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతున్నాం…ఎంత వర్షం వచ్చినా సరే కాలువలు,రిజర్వాయర్లు సరిపోతాయన్నారు..ఒకవేళ ఇవి నిండిపోయినా సరే కృష్ణా నదిలోకి పంపింగ్ చేసేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నట్లు మంత్రి చెప్పారు..12,350 క్యూసెక్కుల కెపాసిటీ తో ఉండవల్లి వద్ద,4000 క్యూసెక్కుల కెపాసిటీ తో బకింగ్ హాం కెనాల్ లోకి,5650 క్యూసెక్కుల కెపాసిటీ తో వైకుంఠపురం వద్ద లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు..అన్నీ పూర్తయితే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క కూడా నీరు నిల్వ ఉండదు..భవిష్యత్తులో కృష్ణా నడికి మరింత భారీ వరద వచ్చినప్పటికీ రాజధాని అమరావతికి ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు.మరోవైపు కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేసేలా రీ డిజైన్ చేస్తామన్నారు.* భవనాలన్నీ బలంగానే ఉన్నాయి..రాజధాని లో 2014 – 2019 మధ్య నిర్మించిన భవనాలు మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి.గతః ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం తో ఆయా భవనాలు సామర్థ్యం ఎలా ఉందనే దాని పై ప్రభుత్వం దృష్టి పెట్టింది.దీని కోసం ఐఐటి హైదరాబాద్,ఐఐటి చెన్నైలకు భవనాలు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది..ఈ నివేదిక ప్రభుత్వానికి అందింది..ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్లు,హై కోర్టు తో పాటు అధికారులు,ఉద్యోగుల కోసం నిర్మాణం చేసిన 3600 ఫ్లాట్ లకు ఎలాంటి ఇబ్బందీ లేదని…వాటి నిర్మాణం కొనసాగించుకోవచ్చని నివేదికలు అందాయి.ఆయా నిర్మాణాల పనులకు రాబోయే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు..ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందన్నారు.అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు వర్షాల వల్ల ఇబ్బంది కలిగిందని..త్వరలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.రాజధాని రైతులకు నేడు లేదా రేపు కౌలు నిధులు జమరాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఒక ఏడాది కౌలు కింద 175 కోట్ల రూపాయలను రేపు లేదా ఎల్లుండి జమ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.* భూములిస్తమంటే నేనే వెళ్లి స్వయంగా తీసుకుంటారాజధానిలోని కొన్ని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద గతంలో రైతులు భూములు ఇవ్వలేదని…అలాంటి వారు ప్రస్తుతం భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.అలా భూములు ఇస్తానంటే వారి ఇంటికి స్వయంగా నేనే వెళ్లి అంగీకార పత్రాలు తీసుకుంటానని మంత్రి నారాయణ చెప్పారు. పన్నుల చెల్లింపునకు గడువు పొడిగిస్తాం*విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన వివిధ రకాల పన్నులకు గడువు ఈ నెల 30 తో ముగిస్తున్నప్పటికీ వరదల కారణంగా ఆయా ప్రాంతాల వారికి వెసులుబాటు కల్పించేలా గడువు పొడిగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.