Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్భూసమీకరణ విషయంలో విన్‌-విన్‌ విధానం

భూసమీకరణ విషయంలో విన్‌-విన్‌ విధానం

ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం
సౌర, పవన హైబ్రిడ్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 4వగ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్​లో సీఎం చంద్రబాబు

గుజరాత్‌:ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామని, సౌర, పవన హైబ్రిడ్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో పాల్గొని ప్రసంగించారు.1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధిరేటు సాధారణంగా ఉండేదన్నారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారత్‌ వాసి ఉంటున్నారని, ప్రతి నలుగురు భారత ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగురాష్ట్రాల వ్యక్తి అని తెలిపారు.ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం గ్రీన్‌ ఎనర్జీ రెవల్యూషన్‌ మొదలైందన్నారు. గతంలో విద్యుత్‌ కోతలు తీవ్రంగా ఉండేవన్న సీఎం, విద్యుత్‌ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు.క్లీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ను ప్రమోట్‌ చేయాల్సి ఉందన్న సీఎం, విద్యుత్‌ బిల్లుల కట్టడికి ఆర్‌ఈతో పాటు కటింగ్‌ ఎడ్జ్‌ సాంకేతికత వాడాలన్నారు. గ్రిడ్‌ నిర్వహణకు సమతూకానికి విద్యుత్‌ రవాణా వ్యవస్థ మెరుగు పర్చాలని, గ్రీన్‌ ఎనర్జీ కారిడార్లను సరిగా నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ద్వారా నేరుగా ట్రాన్స్‌మిషన్‌ చేయాలని, మాన్యుఫాక్చరింగ్‌ ఎకో సిస్టమ్‌ను ప్రమోట్‌ చేయాల్సి ఉందన్నారు.క్లీన్‌ ఎనర్జీ ప్లాంటుల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నారు. క్లీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్​లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్‌ ఎనర్జీ నాలెడ్జ్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, గ్లీన్‌ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉందని తెలిపారు. నెడ్‌ క్యాప్‌ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుందన్నారు.విన్‌-విన్‌ విధానంలో భూసమీకరణ జరుగుతుందన్న సీఎం చంద్రబాబు, భూసమీకరణ సమయంలో మానవతా కోణంలో ఆలోచిస్తామన్నారు. భూసమీకరణకు ఒప్పించి సానుకూల వాతావరణం ఉండేలా చూస్తామని, కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సంస్థలకు అవసరమైన అనుమతుల ఏర్పాటుకు కృషిచేస్తామన్న సీఎం, సౌర, పవన హైబ్రిడ్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సహేతుకమైన ధరలకు భూమి లీజుకు ఇస్తామని తెలిపారు.అంతకుముందు గుజరాత్​లోని గాంధీనగర్​లో ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నానని సీఎం తెలిపారు.ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఆవశ్యకతలు వివరించటం ఎంతో ముఖ్యమన్నారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. వీటన్నింటికీ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​ సాంకేతికతలో అగ్రగామిగా ఉందన్న సీఎం చంద్రబాబు, రాష్ట్రం ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article