ఆకు పచ్చ కూరగాయలు ఉద్యోగం చేసే మహిళలకు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే సమయమే ఉండటం లేదు. ఫిట్ అండ్ హెల్తీగా ఉండటం అనేది ఓ సవాలుగా మారుతోంది. అయితే డైట్‌లో ఆకుపచ్చని కూరగాయలు చేరిస్తే మహిళలు హెల్తీగా ఉండవచ్చు.ఉసిరి మహిళలు తమ డైట్‌లో ఉసిరిని భాగంగా చేసుకోవల్సి ఉంటుంది. ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఇది చాలా ప్రయోజనకరం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, పొటాషియం, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యంగా ఉండగలరు.పెరుగు పెరుగును డైట్‌లో తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. రోజూ పెరుగు తీసుకోవడజం వల్ల బ్రెస్ట్ కేన్సర్ సమస్యను నివారించవచ్చు. అల్సర్ సమస్య ఉన్నవాళ్లు తప్పకుండా డైట్‌లో పెరుగు చేర్చాల్సిందే.పండ్లు-కూరగాయలు రోజూ ఉదయం వేళ డైట్‌లో పండ్లు కూరగాయలు ఉండేట్టు చూసుకోవాలి. హెల్తీ లైఫ్‌స్టైల్ కోసం ఇది మంచి పద్ధతి. మహిళలకు వయస్సు పెరిగే కొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పు తలెత్తుతుంటుంది. అందుకే రోజడూ4 పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ పుష్కలంగా ఉంటే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.బీట్‌రూట్ పెరుగుతున్న వయస్సుతో పాటు మహిళల శరీరంలో ఐరన్ లోపం ప్రధానం కన్పిస్తుంటుంది. ముఖ్యంగా 40 ఏళ్ల తరువాత ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ డైట్‌లో ఐరన్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్, క్యారట్, దానిమ్మ వంటి పదార్ధాలు ఉండేట్టు చూసుకోవాలి.