తమిళ కథానాయకుడు ధనుష్ తన నటనా ప్రతిభతోనే కాకుండా, దర్శకుడిగా కూడా మన్ననలు పొందుతున్నాడు. ‘రాయన్’ చిత్రం ద్వారా ఆయనకు దర్శకుడిగా మంచి మార్కులు పడ్డాయి, ప్రత్యేకించి సినిమా మేకింగ్, యాక్టింగ్ పరంగా. అయితే, కమర్షియల్గా ఈ చిత్రం పెద్ద విజయం సాధించకపోయినా, ఆయన దర్శకత్వం ప్రశంసలు అందుకుంది.ఇప్పటివరకు ధనుష్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, తాజాగా ఆయన తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.ధనుష్ తాజా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఆయన తన 52వ చిత్రాన్ని డాన్ ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థలో అంగీకరించాడు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు, అయితే ధనుష్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.