Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఏడుకొండల వాడ ఏమిటయ్యా ఈ ఘోరం…

ఏడుకొండల వాడ ఏమిటయ్యా ఈ ఘోరం…

ఎందుకయ్య ఇంకామీ మౌనం..
మీ ప్రసాదం అపురూపం..అమోఘం…
అయినా అల్లరిపాలు అవుతుంటే..
ఆవేదనతో రగిలి పోదా ఈ పవిత్ర హృదయం..
కలియుగ ప్రారంభంలోనే ఉన్నామే..
ఇప్పుడే ఇన్ని ఘోరాలు చూడాల్సి వస్తే…
ఈ హైందవ సమాజం ఎటు పోతుంది…
మీరున్నారా లేదా అనాల్సివస్తుందేమో అన్న…
బైటికి వస్తున్నవి నిజాలే అయితే ..
భవిష్యత్ ఒక భయానకం… భక్తులకేది ఇక భరోసా…
కలియుగ దేవుడినే ఇంత కళంకితం చేశారా…
కళ్ళు తెరిచి చూడవా కలియుగేషా…
కఠిన శిక్షలు వేయవా ఈ కర్కోటకులకు…
కాసుల కోసం ఇంత కక్కుర్తిలేలరా..
ఈ సన్నివేశం సమస్త మానవాళికే పెనుప్రమాదం…
ఈ అపచారినికి సంకెళ్లు సరిపోతాయా…సరిపోవేమో..
ఏదీరా హైందవం.. ఎక్కడున్నారయ్యా సాధుపుంగవులరా…
చక్కదిద్దండి ఈ భ్రష్టుపట్టిన సమాజాన్ని..
ఇంత నీచ రాజకీయాలేల …
దేవుడికే దిక్కులేదు…ఇక ప్రజల సంగతి సరే…
ఏమిటీ దుర్మార్గం…ఎందుకింత తెగింపు …
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
తిరుమల ప్రపంచంలో అతిపెద్ద పర్యటన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం. కొలిచే భక్తులకు కొంగుబంగారమై అండగా ఉంటాడని ప్రతీక. శ్రీవారికి ఉన్న ప్రత్యేకత పూజలు హైన్దవ సమాజంలో ఎంతో విశిష్టతతో కుడు కున్నవి.ఆచార వ్యవహారాలు,సనాతన సంప్రదాయాల మేళవింపు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాంగణంలో నిత్యము సంరక్షింప బడుతూ ఉంటాయి. ఎంతో మంది రాజులు,అన్య మతస్తులు స్వామి సన్నిధిలో ఇప్పటికి ఉద్యోగాలు చేస్తూ స్వామివారి సొమ్ము తింటున్నారు.శ్రీవారిని పూజిస్తే వరం.. అపచారం చేస్తే అంతే సంగతులు అన్న నానుడి అనాధిగా వస్తుంది. అలాంటి దివ్య క్షేత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మసకబారే పరిస్థితి దాపురించిందంటే అసలు ఈ పాలకులు అవసరమా అన్న ఆలోచన రేకెత్తిస్తోంది. ఈ దేశాన్ని పాలించిన పరాయి మతస్థుల కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదన్న సత్యం చెప్పబడుతోంది.భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లు దేవాలయాలు ధ్వంసం చేసారని చరిత్ర ద్వారా తెలుసు కున్నాము.ఆఖరికి ఈ దేశాన్ని పాలించిన బ్రిటీష్ వారు కూడా దేశ సంపదను దోచుకుని ప్రజలను హింసించారని తెలుసు. కానీ సనాతన ధర్మానికి వేద వేదాంగాలతో పునీతమై,హైందవ సమాజం కలిగి అనువణునా హిందూ ధర్మం పుణికి పుచ్చుకున్న ఈ భారతావనిలో ఇలాంటి ఘోరాలు చూడాల్సి రావడం ఈ దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమేనని చెప్పాలి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ,అధికార వ్యవస్థ లతో విసిగి వేసారిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయుల పాలనను గుర్తుచేసుకుంటారని ఆనాడే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పిన చందంగా నేటి రాజకీయ, అధికార వ్యవస్థలని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల లడ్డును ఇంత నీచమైన స్థాయికి దిగజార్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టిన ఈ హైన్దవ సమాజం హర్శించదు.ఈ రాష్ర్టానికి ఎంతో మంది పాలకులు వచ్చారు పాలించారు.వారి వారి పాలనను బట్టి ప్రజలు హర్శించారు తిరస్కరించారు. ఇది కాలాను గుణంగా జరుగుతున్న రాజకీయ క్రీడ. ఈ క్రీడలో గెలుపోటములు సహజం కానీ రాష్ర్ట విభజన తరువాత జరుగుతున్న, బైట పడుతున్న సంఘటనలు యావత్ ప్రపంచానికే సిగ్గు చేటు కలిగిస్తున్నాయి. స్వతంత్ర భారతావనిలో మత విద్వేషాలు జరుగుతున్నాయి అది వారి ఉన్మాదం. కానీ కేవలం కాసుల కోసం కలియుగ వేంకటేశ్వరుని ప్రసాదాన్ని ఇలా జంతువుల మాంసం తో ఇతర కొవ్వు పదార్థాలతో తయారుచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి సొమ్ము చేసుకున్నారనే వాస్తవాలు హైందవ సమాజం జీర్ణించుకోలేక పోతుంది. గతంలో బంగారు నగలు ఆభరణాలు,నోట్లకట్టలు పొరుగు రాష్ర్టాలలో పట్టుబడి నప్పుడు అప్పుడు కూడా తిరుమల శ్రీవారికి చెందినవే అన్న ఆరోపణలు వేసిన కూడా ఇంతటి అపచారం కూడకట్టుకోలేదు.కానీ నేడు శ్రీవారి లడ్డు పై వస్తున్న వార్తలు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి.దీనిపై సమగ్ర విచారణ చేసి బాద్యుల పై కఠిన చర్యలు తీసుకోకపోతే యావత్ సమాజం హర్శించదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article