కోటా బియ్యం కొట్టేసిందెవరు
వరద బియ్యం ఎవరి గుప్పిట్లోకి వెళ్లాయ్
ప్రభుత్వం ఇచ్చింది బాధితులకా..బడాబాబులకా..
ప్రాణాలు పోతున్నా పర్వాలేదు…పైసలు కావాలా…
ప్రభుత్వ ఆశయం నీటి పాలేనా ….
పేరుకే పేదలకు.. చేరింది మిల్లర్లకా…
వరదల మాటున బియ్యం మాయ చేసిందెవరు…
బెజవాడ బియ్యం గుంటూరుకు ఎలా వెళ్లాయ్..
ఇక్కడ నోట్లు పంచి అక్కడ మూటలు మాయం చేసిందెవరు…
అధికారుల కళ్ళకు గంతలు కట్టారా…కట్టుకున్నారా…
మాఫీయా మామూళ్లతో గాఢ నిద్రలో ఉన్నారా…
గాడి తప్పిన వ్యవస్థ ను సరిచేయలేరా..
ముత్యాలంపాడు టు మంగళగిరి వైపు ఎలా వెళ్లాయ్..
సింగ్ నగర్ చిత్రాలే వేరున్నాయా…
భవానిపురం బుల్లోడు ఏది అంటే అదేనా…
సింగ్ నగర్ చిన్నోడికి సలామ్ కొట్టాల్సిందేనా. .
సలామ్ కొట్టకపోతే కాటేస్తాడా…
ఇన్ని జరుగుతుంటే అధికారులు రామకోటి రాస్తున్నారా..
కోటా బియ్యం ఎత్తుకెళ్లిన ఆ కాటేశ్వరుడెవరు…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
సంక్షోభంలో కూడా సంక్షేమం ఎలా సృష్టించాలో సరైన ప్రణాళికలు వేసి ప్రజలను కాపాడేందుకు కృషి చేయాలని పదే పదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు.రాష్ర్ట ఆర్థిక పరిస్థితులు చూసి ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.ఏ సమావేశం జరిగిన అది అధికారులతో కావచ్చు పొలిటికల్ మీటింగ్ అయిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులు పై నిరంతర ప్రక్రియ సాగిస్తుంటారు.అందుకే అనుకోని విపత్తు,ఉహించని ప్రళయం కళ్ళుమూసి తెరిచేలోపు ఒక భయానక పరిస్థితి బెజవాడ బుడమేరు ఏరియాలో చోటుచేసుకుంది. ఆ విపత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వరదని సైతం లెక్క చేయకుండా పడవలలో ,జేసీబీ ఇలా ఏ సాధనం ప్రజలకి దగ్గరికి చేర్చుతుందో ఆ సాధనం ద్వారా రాత్రి పగలు శ్రమించి అన్న పానీయాలు అందించేందుకు అహర్నిశలు కృషి చేసారు. అదే సమయంలో పేద ధనిక కులం మతం ఏమి చూడకుండా కొంతమంది అధికారులు అశ్రద్ధ వహించిన లక్షలాది మంది ప్రజలుకు కనీసం కొంతమేర ఉపశమనం కల్గించేందుకు వందలాది లారీలతో బియ్యం ఉప్పు పప్పు అందించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఇదంతా ఒక విధానం అయితే దుర్భిక్షం కూడా దుర్మాగాన్ని ప్రవర్తించారు కొంతమంది సివిల్ సప్లై అధికారులు. ఇప్పటికి అదే దుర్మాగపు ఆలోచనతోనే పేద ప్రజల జీవన ప్రమాణాలతో చెలగాటం ఆడుతున్నారు.బుడమేరు వరదల్లో కూడా రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఇచ్చినవి ఇచ్చినట్లు గానే తరలించారంటే ఈ అధికార వ్యవస్థ రేషన్ మాఫీయా ను కట్టడి చేయ లేని దయనీయ స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందంటే ఇంతకంటే మరొకటి లేదని చెప్పాలి. భవానిపురం నుండి జక్కంపూడి వరకు వరద సహాయం లో ఇచ్చిన రేషన్ బ్యాగులను ప్రజల చేతికి అందించకుండానే వారికి డబ్బులు ఎర చూపి ఎత్తుకెళ్ళి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుని జేబులు నింపుకుంటున్న వైనం చూస్తే నిజంగా మానవ సమాజం ఇంత నీచంగా తయారైనదా అన్న ఆలోచన కలిగితేనే ఒళ్ళు గగుర్పాటు గురిచేస్తుంది. వరద ప్రాంతాల్లో ఎవరు పేద ఎవరికి రేషన్ కార్డ్ ఉందా అన్న ది చూడలేని పరిస్థితుల్లో ఈ రేషన్ మాఫీయా గాళ్ళు వీరికి సంబంధించిన నకిలీ గాళ్ళను సైతం రంగంలోకి దింపి ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచారన్న సమాచారం లేకపోలేదు. సింగ్ నగర్ చిన్నోడు చిందులు వేస్తూ అవినీతి అధికారులు ఎక్కడ బుడమేరు వరదల్లో కొట్టుకుని పోతారేమోనని కంటికి రెప్పలా కాపాడుకొని కోటా బియ్యం హాయిగా బుడమేరు నుంచి బైటికి పంపి మళ్లీ బుకాయింపు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా సివిల్ సప్లై,విజిలెన్స్, పోలీసు,రెవెన్యూ,ఇతర అధికారులకు,ముఖ్యంగా ఆయా ప్రాంత రాజకీయ నాయకులకు తెలియకుండా జరిగిందా అంటే అందుకు సమాధానం దొరకని పరిస్థితి. నకీలీ మీడియా గాళ్ల అండదండలు పుష్కలంగా ఉంచుకుని దారి కాసే దొంగాల్లా బోడి గుండోడి లాంటి యర్నలిస్ట్ లను ఎరగా చేసుకుని యథేచ్ఛగా ఏలుబడి సాగిస్తున్న వీరి యవ్వారం ముడుపువ్వులు అరుకాయాలుగా సాగుతోందన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుడమేరు వరద బాధితులకు సహాయం చేసేందుకు ప్రాంతాలు,జిల్లాలు దాటి వస్తుంటే ఆ సహాయం లో ఇచ్చిన పేదల బియ్యాన్ని నోట్ల అసచూపి దోచుకునేందుకు ఇతర ప్రాంతాలు మంగళగిరి, గుంటూరు, ఉయ్యారు, పామర్రు, ఇలా దీర్ఘకాలంగా రేషన్ మాఫియా నడిపిస్తున్న మాఫీయా గద్దలు వాలి పోయి వరద బాధితులను నట్టేట ముంచి లాభాలు గడిస్తున్నారన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా అధికారులకు తెలియదా అంటే తెలుసు. ఏ సీసీ కెమెరాలు లేవా ఏ లారీ ఎటుపోతుందో ఏ బియ్యం ఎవరు తరలిస్తున్నారో అయినా మాఫీయా ఇచ్చే ముష్టికోసం మౌనం వహించి మత్తు నిద్రలో మునిగి తేలుతున్నారా అన్న అనుమానాలు కలుగు తున్నాయి. పౌర సరఫరాల మంత్రి కాకినాడ పోర్టు ఒక్కటే మూయించగలిగారు.అయతే రోజు పట్టుబడుతున్న బియ్యం లారీలు ఎటూ పోతున్నాయో తెలియదా అంటే మంత్రిని దారి మల్లిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమున్నది చెప్పుకోవటానికి యదారాజ తదా ప్రజా అని అనుకోవాల్సిందే.