ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా పండ్లలో సీతాఫలాలు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. మంట తగ్గుతుంది. కంటి, గుండె ఆరోగ్యం పెరుగుతుంది. వీటిని తినడం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. డిప్రెషన్ తగ్గడం..సీతాఫలాల్లో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మానసిక స్థితిని కంట్రోల్ చేసే సెరోటోనిన్, డోపమైన్, న్యూరో ట్రాన్స్‌మీటర్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ విటమిన్ కారణంగా మూడ్ డిసార్డర్ సమస్య తగ్గుతుంది. దీని వల్ల డిప్రెషన్ దూరమవుతుంది.సీతాఫలాల్లో పొటాషియం, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవి బీపిని కంట్రోల్ చేస్తాయి. దీని వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపిని కంట్రోల్ చేస్తుంది. మెగ్నీషియం హైబీపి సమస్యని తగ్గిస్తుంది.మనం ఎలాంటి జబ్బులకి గురికాకుండా ఉండాలంటే మనలో ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. ఇమ్యూనిటీని బలంగా చేసేది విటమిన్.. విటమిన్ సీ ఈ పండ్లలో ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా వరకూ ఆరోగ్య సమస్యల, సీజనల్ వ్యాధులు దూరమవుతాయి.ఈ పండ్లు తినడం వల్ల దీర్ఘకాలిక మంట తగ్గి గుండెజబ్బులు సహా వంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు. దీనికి కారణం సీతాఫలాల్లోని శోథ నిరోధక సమ్మేళనాలు. వీటితో పాటు సీతాఫలాల్లో క్యాటెచిన్, ఎపికాటెచిన్స్ ఉన్నాయి. ఈ ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ శోథనిరోధక ప్రభావాలను తగ్గించి చాలా రకాల ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి.సీతాఫలాల్లో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్స్‌కి వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలన్, స్టమక్, బ్రెస్ట్ క్యాన్సర్స్ తగ్గుతాయి. ఈ పండ్లలోని ఫ్లేవనాయిడ్స్ కొన్ని రకాల క్యాన్సర్స్‌ని దూరం చేస్తాయి.సీతాఫలాల్లో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. ఇందులోని కరిగే ఫైబర్ గట్‌లో మంచి బ్యాక్టీరియాని పోషిస్తాయి. దీంతో హెల్దీ ప్రేగు కదలికలు, జీర్ణ ఆరోగ్యం మెరుగవుతుంది.సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్ లుటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళలోని ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్‌లో ఒకటైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీంతో కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యం లుటీన్ తీసుకోవడంతో ముడిపడి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. కంటి శుక్లాలు, దృష్టి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి, వీటిని తీసుకుంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది.సీతాఫలాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని తినడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇందులో అనోనాసిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది మెదడు, నాడీ వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తుంది. దీని వల్ల పార్కిన్సన్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అనోనాసిన్ సీతాఫలాల్లోని గింజలు, చర్మంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి,, తినడానికి ముందు గింజలు, పై చర్మాన్ని తీసేసి తినండి. ఆల్రెడీ నాడీ సమస్యలు, పార్కిన్సన్స్ సమస్యలు ఉంటే ఈ పండ్లు తినకపోవడమే మంచిది.అదే ఎక్కువగా తిన్న ఈ పండ్లు తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్స్‌కి అంత మంచిది కాదు. పండ్లు ఆరోగ్యకరమైనప్పటికీ ఎక్కువగా తినకపోవడమే మంచిదని గుర్తుపెట్టుకోండి.