Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుప్రభుత్వం ఇంత అచేతనంగా ఉందా ..

ప్రభుత్వం ఇంత అచేతనంగా ఉందా ..

పాపం వీరు ట్రాన్స్ఫర్ అయ్యారట వార్తలు రాయొద్దట…
సెలవుల్లో నిర్మాణాలు వేశారంట…
నోటీసులు ఇచ్చిన ఆగడం లేదంట ..
బోలెడు ఛార్జ్ షీట్ లు ఫైల్ చేసారంట…
వీరి ఛార్జ్ షీట్లతో ఎన్ని నిర్మాణాలు కూలి పోయాయో..
ఆ అధికారులు అంటే వీరికే వర్తింస్తుదట..
ఇక మీదట వార్తలు అలా రాయొద్దట..
ఎలా రాయాలో కూడా వీరేచెబుతారు మరి..
కళ్ళముందు అక్రమ నిర్మాణాలు ఉన్నా అడగకూడదు..
ఆ అధికారే ప్రశ్నిస్తాడు ….వారిని ఏ వివరాలు అడగకూడదు…
వీరు చెప్పిందే రాజ్యాంగం..వీరు చేసిందే చట్టం…
వీరు ఎస్ అంటే ఎస్ అనాలి…లేదంటే కస్సుబుస్సులాడటం
దీనిని ఏమంటారు..ఎలా అంటారు…
ఇంతకీ ఈ అక్రమాలు సక్రమమా ..అక్రమమా…
కమిషనర్ గారు ఆలోచించండి…
ఎవరా అధికారులు… ఏమిటి అక్రమ నిర్మాణాలు…

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో బెజవాడ నగరం ఒకటి.ఈ అభివృద్ధి లో భాగంగా గృహసముదాయాలు విరివిగా వెలుస్తున్నాయి.సింగిల్ అపార్టుమెంట్,బహుళ అంతస్తులు ఇలా నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే నిర్మానాలు జరిగే పరిధిని బట్టి అవి కార్పొరేషన్ లోకి వస్తాయా..లేక సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయా…మేజర్ పంచాయతీ పరిధిలోకి వస్తాయా అన్నది సరిహద్దు లను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జరిగే ఏ నిర్మాణమైన సంబంధిత అధికారులు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అనుమతులు పొంది పనులు చేయుట అనేది ఒక విధానం. ఇందుకోసం ఏయే నిర్మాణాలకు ఏ విధమైన అనుమతులు మంజూరు చేయాలి వాటి పరిశీలన నిమిత్తం కొంతమంది అధికారులను కేటాయిస్తారు.ఆ విధంగా ప్రభుత్వం ఒక విధానపరమైన ప్రక్రియను ఏర్పాటు చేసింది. ఈ విధానపరమైన నిర్ణయం ప్రకారం అధికారులకు ప్రజల చేత పన్నులు రూపంలో ముక్కు పిండి వసూలు చేసి జీతాలు చెల్లిస్తారు.అలా జీతాలు తీసుకున్న అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది.అలా ఉద్యోగ ధర్మం లో రాజ్యాంగ హక్కులకు లోబడి వారికి అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలి.ఇక్కడ ఏదయితే చెప్పుకొస్తున్నామో ఆ అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని సరిగా నిర్వర్తించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆరోపణలు నిజం కాదు తాము తీసుకున్న చర్యలు అన్నీ కూడా సక్రమమే అని నిరూపించుకోవాలి కూడా. ఇది ప్రజాస్వామ్యం.ప్రశ్నిస్తారు..పత్రికా కథనాలను రాస్తారు.నిప్పు లేనిదే పొగరాదు అన్న చందానా తప్పు ఏమాత్రం చేయనప్పుడు ఏమాత్రం తడబాటు అక్కర్లేదు. కానీ ఇక్కడ అలా జరగడం లేదే. విషయంలో కి వస్తే విజయవాడ గోళ్లపూడి పంచాయితీ పరిధిలో జరిగే నిర్మాణాలను సీఆర్డీఏ అధికారులు పర్యవేక్షించి అవి సక్రమమో అక్రమమో అని దృవీ కరించాల్సి వస్తుంది. ఈ ధ్రువీకరణ కు కూడా చట్టాలు ఉన్నాయి.నియమ నిబంధనలు ఉన్నాయి .అలా జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ప్రశ్నిస్తే మీరెవరు అనే హక్కు అధికారులకు లేదు. ప్రభుత్వం కూడా ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ఓటు అనే ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడతాయి.కాబట్టి ప్రజలకు ఆ హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజాభూమి దిన పత్రిక అక్రమ కట్టడాలపై అనేక కథనాలను వెలువరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం సీఆర్డీఏ అధికారులా మజాకా అన్న శీర్షికతో అక్రమ నిర్మాణాలు చేపట్టే బీల్డింగ్ వివరాలతో కథనం ప్రచురితమైనది.ఆ కథనం పై శనివారం ఉదయం గతంలో గొళ్లపూడి పరిధిలో పని చేసి బదిలీపై వెళ్లారట నాగేశ్వరరావు అనే అధికారి. కథనం చూసి ఫోన్ చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థ కు అధికారులు ఒక భాగం అయితే జర్నలిస్టు కూడా ఒక భాగమే అన్న కోణం మరిచి కథనాలపై చర్చ జరిగింది. ఆయితే ఈ చర్చలో ప్రధాన అంశము ఏమిటంటే కథనం రాసిన దానికి ఖండించక పోగా వారి పరిధిలో ఆ అధికారి,ఆపై అధికారి ఈ ప్రాంతంలో పనిచేసిన కాలం లో నిర్మితమైన నిర్మాణాలు సక్రమమే అనలేదు. పోనీ అక్రమాలు అయితే చర్యలు ఏమి తీసుకున్నారో తెలపండి అంటే దానికి అనేక భిన్నమైన సమాధానాలు.
ఒకటి సెలవుల్లో నిర్మాణాలు చేపట్టారు…ఓకే ఒక నిర్మాణం రాత్రికి రాత్రే పూర్తి అవ్వదు గా..ఏ నిర్మాణం అయిన రోజులు నెలలు పడుతుంది. రెండు.. నోటీసులు ఇచ్చాము.నోటీసులు ఇస్తే అయినా కట్టడాలు ఎలా పూర్తిచేసుకున్నాయి. ఇక మూడవది.. నోటిసులు ఇస్తే గొళ్లపూడి హోల్ సేల్ మార్కెట్ 121 షాప్ లిఫ్ట్ పై ఫ్లోర్ ఎలా పూర్తి అయింది. నోటీసులు మిగిలిన నిర్మాణాలు కు ఎందుకు ఇవ్వలేదు.కేవలం ఆరోజు 121 షాపు పై అనుమతి లేని నిర్మాణం కూలదోసినట్లు ఇతర షాపుల పై అనుమతులు లేని నిర్మాణాలు ఎందుకు కూల్చివేయలేక పోయారు.అంటే దగ్గరుండి కూల్చివేత చేయాలని ఎదురు ప్రశ్న. పత్రికా కథనాలను ప్రచురించేది ఎందుకు మరి .ఏదయినా లోపాలు ఎత్తి చూపితే సరిచేసి ప్రభుత్వ ఆశయాన్ని ఆదాయాన్ని కాపాడాలి.అటు ప్రభుత్వ ఆశయం లేదు ఇటు పన్నులు వేసింది లేదు..ఇక్కడ జరిగింది ఏమిటంటే అదొక అంతుచిక్కని ప్రశ్న.ఎస్ ఈ చర్యలు తీసుకున్నాము..ఈ అపరాధ రుసుము వేశాము.. ఇక మీదట అనుమతి లేని నిర్మాణం చేపడితే చర్యలు ఉంటాయని ముందస్తు సూచనలు చేశారా అంటే అవి ఎక్కడా లేవు.ఇక బిల్డర్ భాషతో ప్రజాభూమి కథనం పై చర్చించాల్సి ఎందుకు వచ్చింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీనిని…ఇక వీరు ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు కాబట్టి ఇక ఇక్కడి విషయాలపై కథనాలను రాయొద్దా.. ఇదెక్కడి రాజ్యాంగము.ఫోర్త్ ఎస్టేట్ అంటే పొడుపు కథలు రాసుకుంటూ ఉండాలా ఏమిటీ.జరుగుతున్న తీరు అక్రమాల పై ప్రభుత్వ దృష్టికి తీసుకురాకూడదా.. అలా అంటే అవ్వదుగా సార్ వారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులకు ఎంత బాధ్యత ఉంటుందో అంత కంటే ఎక్కువ బాధ్యత పత్రికలకు కూడా ఉంటుంది.అధికారులకు సెలవులు అలవెన్స్ లు , రాచ మర్యాద లు ఏసీ గదులు 8 గంటల సమయం మాత్రమే పని చేస్తారు.కలానికి తీరిక ఉండదు..ఏసీ గదులుండవు.. పనివేళ లో కుదింపు ఉండదు.. సెలవులు ఉండవు. అందుకే సూర్యుడికి ముందే ఉంటాడు..సూర్యాస్తమయం అయినా పనిలో ఉంటాడు సార్…తప్పులు చేయకపోతే తడబాటు పడొద్దు… తప్పు జరిగితే సరిదిద్దండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article