ఏం చెప్పినా నో అన్న చంద్రబాబుఇదీ వీరిద్దరి పంచాయితీ
కొండా రాజేశ్వరరావు
సీనియర్ జర్నలిస్టు
++++++++++++++++
ఏపీలో కొత్త రాజకీయం తెరమీదకు వస్తోంది. జగన్ అటు వైనాట్ 175 అంటూ ఇంఛార్జ్ లను మారుస్తూ ముందుకు వెళ్తున్నారు. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ ను ఓడించాలని కలిసిన చంద్రబాబు పొత్తుతో బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నా సానుకూల సంకేతాలు లేవు. ఇప్పుడు ఇదే చంద్రబాబు – పవన్ మధ్య పంచాయితీకి కారణమవుతోంది. పవన్ ప్రతిపాదనలకు చంద్రబాబు నో అంటున్నారు. దీంతో, లోకేష్ యువగళం ముగింపు సభకు పవన్ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు మీడియా పరంగానే తేల్చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతోనే మాపొత్తు ఉంటుంది అని చెబుతుండగా, బీజేపీ మాత్రం మా పొత్తు జనసేనతోనే అంటూ సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి మీడియాతో చెప్పడం ఇక్కడ కొంత గందరగోళంగా తయారయ్యింది. ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారు. ఎవరుతో పొత్తు కొనసాగుతారోనని అనుమానం మాత్రం వెంటాడుతోంది. జనసేన క్యాడర్ మాత్రం టీడీపీతో పొత్తు ఉంటే తాము సహకరించేదే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నప్పటికీ అధినేత మాత్రం తన పని తాను చేసుకుంటూనే పోతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది పవన్ నినాదం. జగన్ ను ఓడించేందుకు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. తాను సీఎం కావటం కంటే జగన్ ఓటమి ముఖ్యమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే పొత్తు ప్రకటించారు. అటు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా టీడీపీతో కొనసాగటానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఇప్పుడు తేడా కొడుతోంది. చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత పవన్ రెండు సార్లు కలిసారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రజల్లోకి వెళ్దామని ప్రతిపాదించినట్లు సమాచారం. బీజేపీ కోసం వేచి చూడకుండా రెండు పార్టీల నుంచి అభ్యర్దుల తొలి జాబితా ప్రకటిద్దామని ప్రతిపాదించారు. దీని ద్వారా రెండు పార్టీల్లోనూ ఎన్నికల జోష్ మొదలవుతుందని. నమ్ముకున్న వారికి సీట్లు ఇస్తే గ్రౌండ్ లో పని చేస్తారని సూచించారు.
సాధ్యమైనంత త్వరగా మేనిఫెస్టో ప్రకటించాలని కోరారు. జనసేన నుంచి 50 సీట్లను పవన్ ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ, చంద్రబాబు ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చేది తేల్చలేదు. బీజేపీ ఇక రాదనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు. కానీ, చంద్రబాబు ఇంకా వేచి చూసే ధోరణితో ఉండటం పవన్ కు రుచించటం లేదు. బీజేపీ తనతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని లోక్ సభకు వద్దనటం పవన్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఖాయంగా ఖరారు చేసే అభ్యర్దుల జాబితా ప్రకటించాలని కోరినా చంద్రబాబు వేచి చూసే ధోరణి పవన్ కు నచ్చటం లేదు. తన మీద తన పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి పరిగణలోకి తీసుకోవాలని పవన్ సూచించారు. అయినా చంద్రబాబు వేచి చూద్దాం సరైన సమయంలో ప్రకటన చేద్దాం అంటూ దాటేస్తుండటం పవన్ లో అసహనం పెంచుతోంది.
అటు జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తూ జనవరిలో పథకాలను అమలు చేస్తున్న విషయం చర్చకు వచ్చింది. చివరి నిమిషంలో అభ్యర్దులను మేనిఫెస్టో ప్రకటిస్తే నష్టపోతామని పవన్ హెచ్చరించినట్లు సమాచారం. కానీ, చంద్రబాబు ఇంకా బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీతో అవసరమని పవన్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ అవసరమైతే..వీరిని కాదని కాంగ్రెస్ తోనూ వెళ్లటానికి అభ్యంతరం లేదనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో..లోకేష్ యువగళం ముగింపు సభకు తొలుత పవన్ హాజరు కావాలని భావించినా..ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. సీట్ల ఖరారు..అభ్యర్దుల ప్రకటన వంటి వాటి పైన ముందడుగు వేస్తే తాను ఎప్పుడు పిలిచినా వస్తానని పవన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ అలకను తీర్చడానికే చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని సమాచారం. చంద్రబాబు అవుట్ డేటెడ్ నిర్ణయాలు తనకు నచ్చడం లేదని పవన్ భేటీలో ఏం తేల్చారో తెలియలేదు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాల పైన నిర్ణయాలు జరిగాయి. పొత్తులు ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు. లోకేష్ యువగళం సభకు హాజరు కావాలని చంద్రబాబు కోరటంతో పవన్ అంగీకరించారు. ఈ సభ ద్వారానే కీలక హామీల ప్రకటనకు నిర్ణయించారు. సీట్ల పైన నిర్ణయం జరిగింది. పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు కీలక అంశాల పైన చర్చించారు. కొంత కాలంగా సీట్ల ఖరారు పైన చర్చలు జరుగుతున్నా నిర్ణయానికి రాలేదు. తాజా సమావేశంలో జనసేనకు 28 అసెంబ్లీ. 2 లోక్ సభ సీట్లు ఇచ్చేలా సూత్రప్రాయంగా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అనకాపల్లి, మచిలీపట్నం లోక్ సభ స్థానాలు జనసేనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గాజువాక, భీమిలి, కాకినాడ, రాజమండ్రి రూరల్, భీమవరం, పిఠాపురం, అమలాపురం, రాజోలు, నర్సాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, ఆళ్లగడ్డ, తిరుపతి, చిత్తూరు సీట్లతో పాటుగా మొత్తంగా 28 అసెంబ్లీ సీట్లు జనసేనకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఇక, ఉమ్మడి మేనిఫెస్టో పైనా చర్చించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళింది. జనసేన సూచించిన మరికొన్ని అంశాలతో కలిపి త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. రాయలసీమ లేదా గుంటూరు కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా మేనిఫెస్టో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మేనిఫెస్టెలో రెండు పార్టీల ప్రతిపాదనలతో పాటుగా రైతు రుణమాఫీ..ఉచిత విద్యుత్ వంటి అంశాలను చేర్చే విషయం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం 10 అంశాలతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జనసేనాని కొన్ని సూచనలు చేసారు. వీటి పైన చర్చించి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల సంకేతాలు రాకపోవటం పైనా చర్చ జరిగింది. ఈ నెల 21న ఢిల్లీలో బీజేపీ ముఖ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశం తరువాత ఏపీ రాజకీయాల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ నెలాఖరు వరకు వేచి చూసి..జనవరి లో సంక్రాంతి వేళ టికెట్ల ప్రకటన..ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెల 20న జరిగే లోకేష్ యువగళం ముగింపు సభకు హాజరు కావటం లేదని తొలుత పవన్ సమాచారం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కోరటంతో పవన్ తన నిర్ణయం మార్చుకున్నారు. లోకేష్ యువగళం యాత్ర ముగింపు సభకు హాజరు కానున్నారు. ఈ సభా వేదిక నుంచే కీలక ప్రకటనలకు సిద్దమవుతున్నారు. పొత్తులుబపటిష్టమా కాదనేది యువగళం ముగింపు మహాసభలో తేలే అవకాశం ఉందనేది వాస్తవం.