అక్రమ నిర్మాణాలపై అడ్డు కట్టే లేదు…
అక్కడ సమాజ హితం…ఇక్కడ అవినీతి అధికారులు హితం…
జీతాల్లేని అధికారులకు అందలం వేసిన వైనం..
అడ్డగోలు నిర్మాణాలు చేస్తున్న అడిగేవారెవరో..
అడ్డంగా దోచుకుంటే ఆర్భాటంగా వీడ్కోలు…
అంతా లోపాభూయిష్టం..అంతిమంగా అన్యాయం..
ఇన్ని జరుగుతున్న ఇట్లే నిర్మాణాలు..
కార్పొరేషన్ కు గండికొట్టేదే కార్పొరేటర్ల్ నా ..
గంధం ప్రసాద్ అవినీతిలో రోజుకో మలుపు…
మరి సిటీ ప్లానర్ ను చక్కబెట్టింది ఆ కార్పొరేటర్ నా…
సిటీ అంతా జరుగుతున్న చిత్రాలు చూడతరమా..
ఆ ఉన్నతాధికారికి గంధం పంపిన తాయిలాలేమిటో…
తాయిలాలు ఇస్తే తప్పులు ప్రోత్సహిస్తారా…
భవానిపురం డివిజన్ నిర్మాణాలు భలే భలే..
అంతా వైసీపీ… నిర్మాణాలన్ని క్లీన్ స్వీప్ ..
ధ్యానచంద్ర కూడా ధ్యాసపెట్టడేమో..లేక దారి మళ్లించారా…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
ధనమే అన్నిటికీ మూలం..అయితే ఆ ధనం సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.కష్టపడి శ్రమించి ధనం కూడబెట్టుకోవడం అనేది అన్నిటికంటే ఉత్తమైన మార్గం. ప్రస్తుతం ఈ ఆధునిక సమాజంలో అహైకిక శుఖాలకు అలవాటు పడిన వ్యక్తులు అనతి కాలంలో నే అత్యంత ధనికులు గా చెలామణి అవ్వడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు.ఇందులో ఈ అక్రమ మార్గానికి కూడా ఒక సర్టిఫికేట్ తో కూడిన హోదా తీసుకుంటున్నారు. అందుకే ఈ సమాజం ఇలా తయారవుతుందని భావించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తప్పులులేని చోట కూడా తప్పులు ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు.ఇలాంటి దుస్థితి బెజవాడ కార్పోరేషన్ లో అధికంగా చోటు చేసుకుంది.
గడిచిన ఎన్నికల్లో ఫ్యాన్ హవా కొనసాగి కనీసం రాజకీయ పరిజ్ఞానాన్ని లేని కేవలం ఆర్దిక ప్రయోజనం కోసం అడ్డంగా సంపాదించుకోవడానికి అలవాటు పడ్డ కొంతమంది ని కార్పొరేటర్ల్ గా ఎన్నుకోవడం జరిగింది. వీరికి అండగా నాటి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అండదండలు పుష్కలంగా ఉండేవి.ఇంకేముంది నిర్మాణం చేపట్టాలంటే నిధులు సమకూర్చుకునే పరిస్థితి దాపు రించింది భవానిపురం ఏరియా వార్డుల్లో. ఇక్కడ నిధులు నిర్మాణానికి సంబంధించి ఇసుక ఇటుక సిమెంట్ నిర్మాణ దారులు కు కాదండోయ్.నిర్మాణం చేపట్టాలంటే నిబంధనలు సడలింపు ,ప్రభుత్వ అనుమతి ఇలా ఇవేమి సరిగా లేకుండా ఉండటం కోసం.నిర్మాణం బట్టి కనీసం రెండు లక్షల రూపాయలు అక్షరాల ఏరియా కార్పోరేటర్ కు ఇచ్చుకోవాలి.ఇక్కడ ఇంకో బంఫర్ ఆఫర్ ఉంది.ఒక కార్పొరేటర్ అయితే కార్పోరేషన్ అనుమతులు కూడా ఇప్పిస్తాడు.. అనుమతుల్లో తేడా ఉన్నా ఆ విషయం బైటికి రాకుండా అటు అధికారులకు ఇటు ఇతరులకు ఆమ్యామ్యా లు ఇచ్చేస్తారు.ఈ సంస్కృతి అనాదిగా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరింత దారుణ పరిస్థితి కి చేరుకుందని చెప్పాలి.ఈ పరిస్థితి చివరికి ఎలా దాపురించదంటే టిపిఓ గంధం ప్రసాద్ అనే అధికారికి జీతం లేదు.విశాఖ, విజయవాడ కార్పోరేషన్లలో ఆయన వెలగ బెట్టిన ఉద్యోగానికి విజిలెన్స్ విచారణ చేసి ఈ అధికారి చాలా మంచిగా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించాడని నోటీసులు ఇస్తే అందుకు వివరణ ఇచ్చిన తాయిలాలు ఇచ్చిన సంతృప్తి చెందని అధికారులు జీతం ఆపేశారు.వైసీపీ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదాసీనత మంచితనం ఎరగా చేసుకుని స్థానిక కార్పొరేటర్ లు మద్దతుతో విశాఖ నుండి బెజవాడ కు బదిలీ అయ్యాడు. ఈ బదిలీతో పాటు ఏ అధికారికి కూడా ఎల్పీసీ ఇస్తారు.
అయితే ఈ గడుసరి గందం ప్రసాద్ కు ఆ లెటర్ ఇవ్వలేదు.అయిన వడ్డించే వాడు మన వాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్న అన్నీ వస్తాయి అన్న చందానా బెజవాడ లో రావడం వస్తూనే రెడ్ కార్పెట్ వేశారు ఇక్కడి కొంతమంది అవినీతి అధికారులు, నీతి లేని కార్పోరేటర్ లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్పీసీ లేకుంటే జీతం ఇవ్వరు.జీతం లేని అధికారికి ఉద్యోగ బాధ్యతలలో లుప్లైన్ లాంటివి అప్పగిస్తారు. ఇక్కడ అలా జరగలేదే ఈ బెజవాడ కార్పొరేసన్ లో ఏ టీపీఓ కు ఇవ్వని వార్డులు ఈ గడుసరి గంధం కే అధిక వార్డులు కేటాయించడం జరిగింది. ఇంకేముంది అనుకున్నట్లు ఇక్కడి కాసుల కోసం కట్టడాలు కు అనేక అడ్డంకులు సృష్టిస్తోన్న కార్పొరేటర్ లకు వరమై నిలిచాడు.
ఇంకేముంది నీకిది నాకిది అంటూ ఏ కట్టడం కట్టాలన్నా కాసులిచ్చుకో కట్టడాలు కట్టుకో అన్న కొత్త సూక్తిని అజెండా గా పెట్టుకుని భారీగా దోచుకున్నారు. ఇలాంటి అవినీతి అధికారులు, నీతి లేని నేతల వల్ల బుడమేరు బెజవాడ ను ముంచెత్తి అన్నామో రామచంద్ర అంటూ అలమటించె స్థితికి కారణమయ్యారు.కొంతమంది నీతిలేని వారి వల్ల వరద నీటిలో కొట్టు మిట్టాడి పోయారు.ఈ రోజు దాదాపు మూడువేలకు పైగా ఆక్రమిత మిర్మాణాలు వందల ఎకరాల లో ప్రక్షాళన చేయాల్సి వస్తుంది.హైదరాబాద్ లో హైడ్రాపేరుతో కూల్చివేతలు చేస్తున్నారు. ఇక్కడ హైడ్రామా మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేస్తున్నారు. ఒక నిర్మాణదారుడు ఒక కార్పొరేటర్ కాసుల కక్కర్తి భరించలేక ఆత్మహత్య చేసుకోబోయిన సంఘటన కూడా గత కొన్ని నెలల కిందట జరిగినట్లు అప్పట్లో వార్తలు బైటికి రాగ మహా తెలివైన కార్పొరేటర్ కాసులిచ్చి కామ్ చెసినట్లు తెలిసింది. అసలు రిటైర్మెంట్ అయిన టిపిఓ సచివాలయం సెక్రటరికి కూడా తెలియకుండా కొన్ని అనుమతులు ఇచ్చినట్లు దాని ఫలితంగా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.భవాని పురం ఐరన్ యార్డ్ 43 వ డివిజన్లో చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలు చూస్తే గత టిపిఓ గందం ప్రసాద్ అవినీతి అట్టే బహిర్గతం అవుతుంది. ఇవన్నీ సిటీ ప్లానర్ కు ఆ ఏరియా కార్పొరేటర్ లకు తెలియకుండా జరిగాయా అంటే సమాధానం అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. అయితే ఈ అవినీతి గంధం ప్రసాద్ మున్సిపల్ శాఖ లో ఉన్న ఓ ఉన్నతాధికారికి అన్ని రకాలుగా చెల్లించుకోవడం తోనే ఆ అండ దండ ఇక్కడ కార్పొరేట్లు దండుగా నిలబడటం తో దండిగా సంపాయించుకుని గొప్పగా సన్మానించుకుని వెళ్లడం జరిగింది.కొత్తగా వచ్చిన కమిషనర్ ధ్యానచంద్ర ధ్యాస పెడతారా లేక ఆయన ధ్యాస కూడా మళ్లించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.