చంద్రబాబు గారు మీ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు…
తిరువూరు ఎమ్మెల్యే తీరుచూడండి…
ఆయన తిట్ల పురాణం విన్నారా ..
కొలికపూడి గారు కొంచెం ఆలోచన చేయండి..
పత్రికలతో అభివృద్ధి ఆగుతుందా…
విజ్ఞులనుకుంటే విచక్షణ కోల్పోతున్నాడు..
ఐఏఎస్ లకు శిక్షణ ఇస్తున్నారుగా..
ఇంత అవివేకంగా మాట్లాడితే ఎలా..
పేకాటాడటం తప్పే అందుకు శిక్షించాలి…
చట్టం ఉంది…ఈ తిట్లు సమంజసమేనా…
పేదల బియ్యం మీ పరిధిలోనే దారితప్పుతున్నాయిగా…
అది బహిరంగ సత్యమేగా
వారు మీ పార్టీ వారుకాదని మీకూ తెలుసుగా
సొంత పార్టీ సర్పంచ్ పై చిందులేస్తున్నారు..సంతోషం…
మరి ఈ బియ్యం దొంగల మాటేమిటి..
ప్రజాస్వామ్య మంటే మీరే అర్థం చెబుతారు
మరి మీరు ప్రజా స్వామ్యాన్ని అగౌరపరిచేలా ఉంటున్నారే..
వంద రోజులకే ఇలా అయితే ఇంకా బోలెడు రోజులున్నాయి ఎలా ..
పునరాలోచించండి కొలికపూడి గారు..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
తిరువూరు ఎమ్మెల్యే తిట్ల పురాణం చూసి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. నిన్నటి వరకు గత ప్రభుత్వ పాలకుడిపై ఆ పార్టీ ఎమ్మెల్యేల భూతు పురాణం పై మీడియా వేదికల సాక్షిగా పుంఖాలు పుంఖాలుగా విశదీకరించి ప్రజల్లో ఒక మంచి ఆలోచన పరుడిగా ఉండి ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతుంటే తల్లడిల్లి పోదా ఈ ప్రజాస్వామ్యం. దేశానికి పటిష్టమైన వ్యవస్థ ను గాడిలో పెట్టె ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసులు కు అభ్యర్థులు ఎంపిక కావడానికి బోధనలు చేసే వారు ఇప్పుడు ప్రజాప్రతినిది పదవి లో ఉండి ఇప్పుడు ఇలా ప్రజల సమక్షంలో ‘‘ నా వెంట్రుకలు కూడా పీకలేరు.. చెప్పుతో కొడతా నా కొ..కా’’ ఇలాంటి భూతులు మాట్లాడితే భోదించే భోదకుడు ఇలా భూతులు ఏమిటీ అని మీ బోధన లో ఉన్నా బావిభారత పౌరులు ఆలోచించారా ఎమ్మెల్యే గారు.
గత వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం చేయలేదని అనేక పోరాటాలు చేయడం తో పాటు నిత్యం మీడియా సాక్షిగా అనేక మార్లు రాజకీయ ఆర్దిక విధానాన్ని,ఆర్థిక స్వావలంబన ,రాజకీయ పార్టీల విధానం, శాసనసభలో విధానపరమైన అంశాలు వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు జరిపిన విజ్ఞులు గా ఉన్న మీరు ఈ రోజు బహిరంగంగా ఏదయితే మీకు గుర్తింపు ఇచ్చిందో అదే వ్యస్వస్థ పై రాయలేని భాషలో తిట్ల పురాణం మాట్లాడితే సమాజం హర్శించదన్న లోకొత్తర ధర్మాన్ని ఎందుకు మరిచారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న గా మిగిలిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే..కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు శాసనసభ్యులు.కూటమిభాగస్వామ్యం లో టీడీపీ తరపున తిరువూరు నుంచి గెలిచారు. గెలిచిన తొలినాళ్లలో నే జేసీబీ ఎక్కి అక్రమ నిర్మాణాలు అంటూ స్వయంగా కూల్చివేయడం జరిగింది. ఆ తరువాత నియోజకవర్గ పరిధిలో రేషన్ మాఫీయా లారీలను ఆపుతున్నారని పలువురు యూట్యూబర్లను అరెస్ట్ చేయించడం జరిగింది. ఆతరువాత తిరువూరు నుంచి తరలిస్తున్న అక్రమరేషన్ లారీలను ఏ కొండూరు వద్ద ఆపిన కొంతమంది యూట్యూబర్లను కొట్టిన సంఘటన వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత క్వారీ తవ్వకాలపై ఓ దిన పత్రిక (ప్రజా భూమి కాదు) కథనాలను ప్రచురించిందని నోరుపారేసుకున్నారు. ఇక ఓ సర్పంచ్ పేకాట లో దొరికాడని నానా భూతులు మాట్లాడటం జరిగింది. తిరువూరు అభివృద్ధి కి పత్రికా కథనాలే కారణమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అనడం ఒక విదంగా చాలా హాస్యాస్పద విషయంగా చెప్పాలి.ఎందుకంటే పత్రికా కథనాలలో క్వారీ తవ్వకాలపై తప్పుడు రాతలు రాశారని ఒక వైపు అంటూనే ఇంకో వైపు తహసీల్దార్ కు ఫిర్యాదులు ఇస్తుంటే అభివృద్ధి ఆగిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడితే అది సమాజ విరుద్ధం అవుతుంది అది ఆయన ఆవేదన చెందడం లో అర్థం ఉంది.కానీ సర్పంచ్ పేకాట ఆడితే,క్వారీ తవ్వకాలపై వార్తలు రాస్తే అభివృద్ధి ఆగిపోయిందంటే ప్రజలు ఫక్కున నవ్వుతారు.పోనీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ కాదుగా అమ్మో వార్తలు వస్తే అధికార పార్టీ వారు అడ్డుకుని రాద్దాంతం చేసి ఇబ్బందులు పెడతారు అనుకోవచ్చు.ఇక్కడ విచిత్రమేమిటంటే ఎమ్మెల్యే అధికార పార్టీనే అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలు పాటించి తీరాల్సిందే.మరి అభివృద్ధి కి ఎక్కడ విఘాతం కలుగుతుందో మేధావులు ఆలోచన చేయాలి. తిరువూరు రేషన్ డాన్ పరాయి జిల్లా నుంచి వచ్చి గత మంత్రి జోగి అనుచరిడిగా ఉంటూ పగలు రాత్రి లేకుండా అక్రమ రవాణా చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొన్ని రోజులు ఆగినా ఆ తరువాత యదారాజ తదాప్రజా గా అన్నట్లు లారీలు జోరుగా తిరుగుతున్నాయి. అందుకు నిదర్శనం ఇబ్రహీంపట్నం పోలీసులు ఇటీవల సీజ్ చేసిన లారీలే.ఆ తరువాత ఏ కొండూరు ,కంచికచర్ల పోలీసులు పట్టుకున్న లారీలు సాక్ష్యం. ఇవన్నీ కూడా తిరువూరు పరిధిలో నుంచి వస్తున్న అక్రమ రేషన్ బియ్యమే.ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన ఎమ్మెల్యే ప్రజాక్షేత్రం లో ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.