హైదరాబాద్:-రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్నీ శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. BFSI కోర్సులకు సంబంధించి స్కిల్ ప్రోగ్రామ్ లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డున పడ్డారని తెలిపారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది. నిరుద్యోగులు వెబ్ సైట్ లో దాదాపు 30లక్షల మంది యువత పేర్లు నమోదు చేసుకున్నారు. అన్నీ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు.యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారంతా జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించాలన్నారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఉద్యోగాలు లేక యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.