Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలున్యాయస్థానాలకు ప్రత్యామ్నాయ భవనాలను సమకూర్చండి

న్యాయస్థానాలకు ప్రత్యామ్నాయ భవనాలను సమకూర్చండి

-ఉన్నతాధికారులను ఆదేశించిన పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి

హిందూపురంటౌన్:హిందూపురం న్యాయస్థాన ఆవరణలో ప్రస్తుతం నిర్వహిస్తున్న న్యాయస్థాన భవన సముదాయాలు శిథిలావస్థ కు చేరుకున్నాయని స్థానిక బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ కే.శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు పరిపాలనా న్యాయమూర్తి తీవ్రంగా స్పందించి వెంటనే కోర్టు ల నిర్వహణకు అనువుగా ఉండే ప్రత్యామ్నాయ భవన సముదాయాలను సమకూర్చాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తదితర ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా హిందూపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ న్యాయవాది జి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రామచంద్రారెడ్డి, సుదర్శన్, జి ఆర్ సిద్దు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం, అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం, ప్రత్యేక న్యాయస్థానం భవన సముదాయాలు శిథిలావస్థ కు చేరుకోవడంతో విధుల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పరిపాలన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి తోడు హిందూపురాన్ని జిల్లా న్యాయ కేంద్రంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని, కోర్టు ఆవరణలో మరుగుదొడ్లు లేకపోవడంతో అటు కక్షిదారులు ఇటు న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంచినీటి సౌకర్యం కల్పించాలని విన్నవించారు. దీనికి తోడు న్యాయస్థానాల కోసం నూతన భవన సముదాయాలను మంజూరు చేయాలని పరిపాలనా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందుకు పరిపాలన న్యాయమూర్తి జస్ట్ శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ త్వరితగతిన కోర్టు ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భవన సముదాయాలను సమకూర్చాలని అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరుగుదొడ్లు ఇప్పటికే మంజూరయ్యాయని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలియజేసినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిశీలించేందుకు తన వంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి తెలియజేసినట్లు చెప్పారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో శ్రీనివాస్ తో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు హైకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్ప గుచ్చాలు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article