*ఏజీటీయూపీఎస్ఎస్
రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ
రాయలసీమ ప్రతినిధి(తిరుపతి):
సామాజిక మార్గ నిర్దేశకులు, మహోన్నత మహిమాన్వితులు ఉపాధ్యాయులేనని
అఖిల గాండ్ల, తెలికుల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమ సంఘం (ఏజీటీయూపీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ అన్నారు. ఆదివారం తిరుపతి వీ.హెచ్.కే. ఫంక్షన్ హాల్ నందు
తిరుపతి జిల్లా, తిరుపతి నగర కార్యవర్గం సంయుక్త ఆధ్వర్యంలో గాండ్ల సామాజిక వర్గ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గాండ్ల సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు మన కుల ప్రతిష్ట కోసం, భావితరాల భవిష్యత్తు నిర్మాణం కోసం నిత్యం అందుబాటులో ఉండాలని కోరారు. ముఖ్యంగా గాండ్ల కులంలోని ఉపాధ్యాయులు సమాజాన్ని , అనేక రకమైన ఆదర్శవంతమైన జీవితాన్ని సమాజానికి అందించడం జరిగిందని, వారి సేవలు బహుముఖమైనవని, అమూల్యమైనవాని కొనియాడారు. ఉపాధ్యాయులు ఉత్తమమైన జీవితాన్ని ఆచరిస్తూ సమాజంలో మేటి తరాన్ని అందిస్తున్న వారని, అలాంటి వారిలో మన గాండ్ల కులస్తులు ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని, వారిని గౌరవించుకుని, మనమందరం సత్కరించడం అభినందనీయమని వక్తలు అన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కే.విజయలక్ష్మి (సూళ్లూరుపేట), రాజ్యలక్ష్మి (గూడూరు), రమేష్ (నాయుడుపేట), చెంచు కృష్ణయ్య (వెంకటగిరి), ఆర్కాడు మురళి (శ్రీకాళహస్తి), కందాటి విజయభారతి (వడమాలపేట), గోపాలకృష్ణ (ఐతేపల్లి), అనిల్ కుమార్, టి. సి.బాలకృష్ణ, పి. వరలక్ష్మి, పాతలపాటి ప్రసాద్, ఇంజేటి రామకృష్ణారెడ్డి, పన్నూరు మోహనమూర్తి, బీ.వీ.ఆర్. ప్రసాద్ (తిరుపతి) తదితరులకు ప్రశంసా పత్రాలు, అవార్డులను ముఖ్యఅతిథి వాకాటి హరికృష్ణ, కార్యక్రమం నిర్వహణ ముఖ్యులు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలకు ప్రముఖ రచయిత శాకం నాగరాజు విశిష్టమైన పుస్తకాలను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు కందాటి రామిశెట్టి , తిరుపతి నగర అధ్యక్షుడు బద్రి జయ కుమార్, తిరుపతి నగర గౌరవ అధ్యక్షుడు పూజారి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మురళి, సంఘ నాయకులు రొంపిచర్ల హరి, చెరుకుపల్లి ఈశ్వరయ్య, దేవరకొండ భాస్కర్, ప్రముఖ రచయిత నాగరాజు, డాక్టర్లు విజయ్, అర్చన, వెంకట ముని ఆర్కాడు మురళి, నారు రెడ్డప్ప, వినయ్, తేజ, గాండ్ల కుల పెద్దలు వేలూరు జగన్నాథం, పేరూరు పద్మాకర్, బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, సుదీర్ తో పాటు రాష్ట్ర నాయకులు గిరిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.