జగ్గంపేట :: జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా నియమితులైన వై ఆర్ కే శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు చేపట్టిన అనంతరం జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు. జగ్గంపేట సర్కిల్ లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటానని శాంతిభద్రతలు కాపాడతానని సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కే శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను పాల్గొన్నారు.