జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట :స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను కలవడం ఆయన కేంద్ర సహకారంతో మోడల్ డిగ్రీ కాలేజీ ల్యాబ్ కు మరియు వాటికి అవసరమైన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్ పి ఎం సి ఎల్ నిధులు కేటాయించాలని కోరడం వెంటనే నిధులు రావడం జరిగిందని పనిచేసే నాయకుడు జ్యోతుల నెహ్రూ లాంటి వ్యక్తికి అన్ని విధాల సహకరిస్తామని తెలియజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాలేజీకి కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చిన రామ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని గత 2019 నుండి 24 వరకు కాలేజీ గత పాలకులు వల్ల ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ ను కూడా 35 లక్షల రూపాయలు కోరడం ఆయన వెంటనే స్పందించి నిధులు కేటాయించడం జరిగిందని పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు బిజెపి ఇన్చార్జ్ దాట్ల కృష్ణ వర్మ, జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు కామినేని జయ శ్రీ, దాసరి తమ్మన్న దొర, తదితరులు పాల్గొన్నారు.