ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7కు విచారణను వాయిదా వేసింది. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నార్సింగి పోలీసులు ఆయనను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నార్సింగి పోలీసులు ఈ కేసులో ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు, జానీ మాస్టర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్‌ను నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ నిర్వహించి పలు విషయాలను రాబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.