Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్వజ్ర కిరీటి ధారిగా బాలా త్రిపుర సుందరి దేవి దర్శనం

వజ్ర కిరీటి ధారిగా బాలా త్రిపుర సుందరి దేవి దర్శనం

నవరాత్రులలో మొదటి రోజు కనక దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తున్నారు. కాగా నిర్మలమైన మనసుతో పూజిస్తే కోరిన వరాలు ఇచ్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలుచుకునే కనక దుర్గమ్మకు ఓ భక్తులు కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని బహుకరించారు.ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లి వజ్ర కిరీటి ధారిగా భక్తులకు కనిపించారు. 2.50 కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని ముంబై కి చెందిన సౌరబ్ గౌర్ విరాళంగా అందించారు.ప్రస్తుతం దసరా ఉత్సవాల ఆరంభం సందర్భంగా గురువారం అర్చకులు అమ్మవారిని ఈ కిరీటంతో అలంకరించారు. కడపకు చెందిన సీఎం రాజేష్ ఇచ్చిన సూర్య, చంద్ర ఆభరణాలు, వెస్ట్ గోదావరి జిల్లా ఖండవల్లి కి చెందిన సూర్యకుమారి వజ్రాల తో పొదిగిన ముక్కెర, నత్తు, బులకీ, కర్ణభరణలు ‎కూడా నేడు అమ్మ‌వారికి అలంక‌రించారు.

విజయవాడ:-దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు నవ దుర్గలుగా వివిధ అవతారాల్లో తన భక్తులతో పూజలను అందుకోనున్నది. అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయం వైభవంగా ముస్తాబైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రులలో మొదటి రోజు కనక దుర్గమ్మ అమ్మవారి అలంకారాలని అనుసరించి. కనక దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తున్నారు. కాగా నిర్మలమైన మనసుతో పూజిస్తే కోరిన వరాలు ఇచ్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలుచుకునే కనక దుర్గమ్మకు మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని బహుకరించాడు.విజయవాడ దుర్గమ్మ నేటి నుంచి భక్తులకు బంగారు కిరీటంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బంగార, వజ్రాలతో తయారుచేసిన బంగారు కిరీటం విలువ సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. పసిడి కిరీటాన్ని అమ్మవారికి ముంబయి వ్యాపారవేత్త సౌరభ్ గౌర్ బహుమతిగా అందజేశారు. నేడు కనక దుర్గాదేవి నవరాత్రులలో మొదటి అవతారంగా బాలా త్రిపుర సుందరిగా ఈ వజ్ర కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తనకు కనక దుర్గమ్మ అంటే అపారమైన భక్తి అని అందుకనే ఆ భక్తిభావంతో ఈ కానుకను నవరాత్రులలో తొలి రోజు అందించినట్లు సౌరభ్ గౌర్ తెలిపారు. మరోవైపు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి చీర సారెలతో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిలో భక్తుల సందడి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article