Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుభయం…భయం…బుడమేరు భయం

భయం…భయం…బుడమేరు భయం

ఉరుములు మెరువులతో ఉత్కంఠ…
ఆపరేషన్ బుడమేరు అంతా తూచ్
ప్రభుత్వ యంత్రాంగానికి తీరిక లేదా…
పేద్ద మసనుషుల కోసం పునరాలోచిస్తుందా..
తుఫాన్ హెచ్చరికలు హెచ్చరిస్తుంటే…
నాడు తడిసిన ఇల్లు నేడు తడబాటు చెందుతుంటే…
భారీ వరదలు వస్తే మళ్లీ నష్ట పోవాల్సిందే నా..
బుడమేరు భయం పోయేదెన్నడు..
పేదల జీవితాలు బుగ్గిపాలు కాకుండా చేసేదెన్నడు..
బాబు గారిఆలోచన అమలయ్యేదెన్నడు…
బడా బాబులు బాబుపై ఒత్తిడి తెస్తారా..
ఇక బుడమేరు గండం వీడేదెన్నడు…?

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఒక ప్రమాదం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఒకరి నిర్లక్ష్యం కావచ్చు లేదా ఇంకేదయిన కారణం కావచ్చు ఉహించని విపత్తు వల్ల జరిగిన నష్టం పునరావృతం కాకుండా చేయగలిగింది చేస్తేనే భావితరాల భవిష్యత్ బాగుంటుంది.పాలకుల నిర్లక్ష్యం వహించినా వహించక పోయినా ప్రకృతి ప్రకోపానికి ఎవరైనా బలి కాక తప్పదు.అయితే ఈ ప్రకృతి ప్రకోపం ప్రతిసారి ఉంటుందా అంటే కాదని చెప్పాలి.కొన్ని విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి ప్రళయం తట్టుకోలేము. ఆ ప్రకోపం లో ఎన్నో ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ప్రకృతిని కూడా తమ స్వార్థం కోసం పాడు చేసి నప్పుడు ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఆ దారుణాన్ని పసిగట్టాలంటే కూడా ఉహించలేము.అలాంటిదే బుడమేరు ప్రమాదం. గత ఇరవై సంవత్సరాల క్రితం బుడమేరు పొంగింది. భారీ నష్టం తెచ్చిపెట్టింది. ఆ తరువాత పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా మళ్ళీ బుడమేరు ఉగ్రరూపం దాల్చింది అందరిని బురదలో ముంచెత్తింది.ఎన్నో ప్రాణాలు బురద నీటిలో కొట్టుకుపోయాయి.ప్రభుత్వం స్పందించింది రాత్రి పగలు కష్ట పడ్డారు పోయిన ప్రాణాలు తీసుక రాలేక పోయినా ఉన్న ప్రాణాలకు ఊరట కల్పించారు.ఈ లోపు ప్రకృతి శాంతించింది బుడమేరు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కల్లోలంలో దాదాపు 10రోజులు తిండి తిప్పలు సరిగా లేకపోయినా తప్పని పరిస్థితుల్లో తల్లడిల్లిన జనానికి తాత్కాలిక ఉపశమనం దొరికింది. ప్రభుత్వం ఇందుకు గల కారణాలపై సమగ్ర అధ్యయనం చేసింది. దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచనలు తీసుకుని దాదాపు మూడు వేలకు పైగా ఇల్లు ఎనబై నిర్మాణాలు ఆక్రమిత బుడమేరు లో ఉన్నాయని ఆపరేషన్ హైడ్రా లాగా ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని ప్రకటించారు. ఆలోపు అమ్మవారి ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి ముగిశాయి.మళ్లీ ప్రకృతి హెచ్చరికలు మొదలయ్యాయి. ఆకాశం లో అలజడి బడ బడమనే భీకర శబ్దము లు వాతావరణ శాఖ సూచనలు ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు.ఇవన్నీ చూస్తున్న బుడమేరు లో మునిగిన భాదితుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.ఒక సారి వచ్చిన విపత్తు రావచ్చును రాక పోవచ్చను. కానీ ఆ ప్రమాదం నుంచి తేరుకోక ముందే మళ్లీ వర్ష సూచనలు అల్పపీడనాలు అని సంకేతం వస్తుంటే ఆందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు అయితే ప్రకృతి విపత్తు కంటే మానవ విపత్తు ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పాలి. స్థలాలు కబ్జా,వాగు వంకలు నదీ పరివాహక ప్రాంతాల్లో సరస్సు లు ఇలా బడాబాబుల స్వార్థం కోసం ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడంతో వరద ప్రవాహం కు దారి లేక పోవడంతో దాని పని అది చేసుకుంటూ పోతోంది. ఈ నేపధ్యంలో బ్రతుకు జీవుడా అని జీవిస్తున్న బడుగు జీవులకు బడా శాపంగా మారుతోంది బుడమేరు.ఇప్పటికయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు పై ఆలో చించి బడాబాబుల ఒత్తిడికి తలొగ్గకుండా తక్షణ చర్యలు చేపడితే ఇలాంటి తప్పిదాల నుంచి బైట పడొచ్చు అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article