Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఓ గాయని విషాధ గాధ

ఓ గాయని విషాధ గాధ

వీళ్ళు మనుషులా, మానవ మృగాలా?!
గాయకుడైతే, గాయాలు ఎన్నో చేయొచ్చా?!
ఆ గాయకుడు వెనుక ఉన్న నీచ గాధ ఏమిటో తెలుసా?!
గాయకుడు చేసిన తప్పిదానికి గాయని బలి కావాలా?!
ఇంకా ఎంత కాలం ఆ గాయని ఆ గాయాన్ని భరించాలి?!
రెండు చేతులు కలిస్తే కదా శబ్దం వచ్చేది…?
ఇందులో తప్పు గాయకుడిదా, గాయనిదా?!
గాయకుడు మరణించినంత మాత్రాన అతని నీచ గాధలు మర్చిపోవాలా?!
మరణమే అన్నిటికీ చివరి మార్గమా?!
మరణిస్తే మర్మాలు మాసిపోతాయా?!
ఇలా మాసిపోతే తప్పులు చేసి తనువు చాలిస్తే సరిపోతుందంటే…?
ఇంకెంత మంది తల్లులు తనువులు చాలించాలి?!
ఇదే నా సమాజం?! ……
ఓ మానవతి మరుపు చేసుకో మరొక్కసారి!

కృష్ణ సింధు ప్రజాభూమి ప్రతినిధి కల్చరల్&క్రైమ్

సమాజంలో ఒక స్త్రీని నిందించే అంత సులువుగా మానవ మృగాలపై మాట్లాడేందుకు కూడా ముందుకు రాని విధానంలో బ్రతుకుతున్నామని ఆలోచన చేస్తే హృదయం బరువెక్కి పోతుంది. అలనాటి నుండి నేటికీ “ఆడదే అన్నిటికీ ఆధారం”, ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందని చెప్పుకోవడానికి బాగా పనికి వచ్చే స్త్రీ, ఏదైనా పొరపాటు జరిగితే ఆ స్త్రీని నిందించడానికి కూడా వెనుకాడడం లేదంటే ఈ సమాజం ఎటు పోతుందన్న ప్రశ్న స్త్రీ జాతిలో ఇప్పటికీ మెలుగుతూనే ఉంది. రోజు రోజుకి జరుగుతున్న సంఘటనలు చూస్తే మానవ మృగాల చేతిలో ఎందరో మానవతులు తనువు చాలిస్తున్న అవి తాటికాయ అంత అక్షరాలతో రాసుకోవడానికి పనికొస్తున్నాయే తప్ప, దీర్ఘకాలికంగా మానవతికి మానవ మృగాల నుండి రక్షణ లేదన్నది నిత్య సత్యం. ఏ రంగంలో చూసినా మానవతులపై మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి. మానవ మృగాలు మాత్రం మురిసిపోతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే నాధుడు ఎవరా అని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గురించి చెప్పదలుచుకుంటే- అందమైన లోకాన్ని ఊహించుకొని తన గాత్రంతో గానాన్ని వినిపించి గాయక లోకంలో తాను కూడా ఒక గడుసరి అని అనిపించుకోవాలని అడుగులు వేసింది ఓ గాయని. బెజవాడ కళా రంగం అంటే దేశ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతటి గుర్తింపు పొందిన కళా రంగంలో తనకు కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అటువైపు పయనిస్తున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఒక గాయకుడి గానం, ఈ గాయని మనస్సును మైమరపింప చేసింది. అయితే గాయని గాయకుడిలోని గానాన్ని మాత్రమే చూస్తే, ఆ గాయకుడి జీవిత గాధలో అనేక చిత్ర విచిత్ర గాథలు ఉన్నప్పటికీ వాటిని మసిపూసి మారేడు కాయ చేసి మరో గాయని సహకారంతో, అందుకు పైన సోదరీ భావం, లోన ఇంకొక భావంతో ఉంటూ, ఇంకొక గానానికి తన గానంతో కలుపుకొనుటకు చక్కటి ప్రణాళికలు వేసుకున్నాడు. తన అదృష్టమో, దురదృష్టమో లేక విపరీతకాలే వినాసబుద్ధి అని ఏదైనా అయి ఉండొచ్చు లేక కామం, మోహం, వ్యామోహం ఇలా ఎన్ని రకాలుగా అర్థాలు తీసుకున్నా, ఒక చక్కటి కుటుంబాన్ని వదిలి గాయని ఈ గాయకుడి గానం ఆ గానం వెనుక ఉన్న విపరీత బుద్దుల్లో నుంచి వచ్చిన అందమైన మాటలు, చేష్టలు, పొగడ్తలు అన్నింటికీ ఈ గాయని ఆకర్షితురాలైంది. ఆలోచన చేసేలోపే అన్ని అవధులు దాటిపోయాయి. అనాలోచిత నిర్ణయాలతో తప్పు గాయకుడిదా లేక గాయనిదా అన్నది పక్కన పెడితే, కళా రంగంలో ఈ గాయకుడికి గాయనికి ఒక పవిత్ర బంధాన్ని ఏర్పాటు చేసేలా పరిస్థితిలు దాపరించాయి. ప్రేమ అనే మడుగులోకి దిగిన గాయని గాయకుడి ప్రయాణంలో, అతడు చేసిన గత గాధలన్నీ గాయనికి ఒక్కొక్కటిగా తెలుస్తూ వచ్చాయి. అయినప్పటికీ అడుగుదాట వేసిన తర్వాత ఆలోచించినా ఉపయోగమేలా అని ఆ గాయకుడితో పూర్తిగా పయనించేందుకు సిద్ధమైతే, భగవంతుడు ఈ బంధాన్ని ఒప్పుకోలేదో, ఓర్వలేకపోయాడో, లేక అపవిత్రం అనుకున్నాడో ఈ సమాజం ఏమనుకున్నదో తెలియదు కానీ అనతి కాలంలోనే ఆ గాయకుడు ఈ గాయనికి, ఈ కళారంగానికి అందనంత దూరానికి వెళ్లిపోయాడు. ఆఖరి మజిలీలో ఆ గాయకుడ్ని కాపాడుకునేందుకు ఇంకొక గాయనితో కలిసి అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించి అనేక విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ భగవంతుడు చిన్నచూపు చూశాడు. ఆ తదనంతరం ఆ గాయకుడు సమాజానికి సోదరిగా చెప్పకున్న మరో స్త్రీ ఈ గాయకుడితో జీవితాన్ని పంచుకోవాలని సిద్ధపడ్డ గాయనికి, ఒక్కొక్కటిగా అతని గత జీవితపు గాధలను తెలియపరుస్తూ గాయని గుండెను మరింత గాయం చేసింది. ఒక వైపు ఈ గాయాలన్నీ భరిస్తూ, గాయకుడు లేడన్న బాధను భరించాలో లేక తాను కూడా గాయకుడి దగ్గరికి చేరుకోవాలని తొందరపాటు నిర్ణయం కావచ్చు లేక తన తనువును చాలించుకోవాలన్న తపన కావచ్చు. ఏది నిర్ణయించుకోవాలో తెలియక కొట్టుమిట్లాడుతున్న సందర్భంలో కళా రంగంలో జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే మరోవైపు గాయకుడి కుటుంబ సభ్యుల నుంచి ఘోరమైన అవమానాలు ఎదుర్కొంటూ, మరోవైపు నిందలను మోస్తూ, గాయకుడి గానం తప్ప గాయకుడి కుటుంబం అంతా కూడా గందరగోళమేఅని తెలిసినా ఆ గాయకుడి కుటుంబం అంత గంధరగోళం అని తెలిసి ఆ గాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న చివరి నిముషంలో చిల్లర కర్చులకు కూడా ఆలోచన చేసి ఆర్థికంగా వనరులు సమకూర్చాలని అన్నప్పటికే అదే హడావిడి తో ఆ గాయకుడి మీద ఉన్న ప్రేమాభిమానాలతో పరుగులు పెట్టెలోపే అక్కడ ప్రాణాలు పోయాయి. అక్కడ కూడా అవమానాలు, ఆపనిందలు భరించక తప్పలేదు. కనీసం ఆ గాయని కూడా తమ కుటుంబంలో ఆడపిల్ల లాంటిది కాదా అనే ఆలోచన చెయ్యకుండా, అడిగినంత డబ్బు సమకూర్చలేదని తమ కుటుంబంలో ఒక ఆడపిల్లగా ఏ మాత్రం చూడకుండా తమ స్వార్థం కోసం తమ కుటుంబంలో అడిగినంత డబ్బులు సమకూర్చలేదని తమ స్వార్ధం కోసం అబద్దాలను నిజాలు చేయుటకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇందులోని నిజ నిజాలు గాయపడ్డ గాయనికి, సోదరి అనబడే మరొక గాయనికి మాత్రమే తెలుసు. అందుకు ఆధారాలు కూడా గాయపడ్డ గాయని దగ్గర ఉన్నాయి. అయినా కూడా గాయకుడి రహస్యాలు తెలిపిన ఆ సోదరి .. గాయపడ్డ గాయని నీ కళారంగంలో తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ పబ్బము గడుపుకుంటుందని తెలిసిన పేదవి విప్పలేని పెద్ద మనుషులు ఈ కళా రంగంలో ఉన్నారని చెప్పటంలో సందేహం లేదు. నాడు గాయకుడు పంచన చేరి పబ్బం గడుపుకున్న వారంతా గాయపడ్డ గాయని మరణాన్ని కోరుకుంటున్నారేమో అన్న అనుమానానికి ఎక్కడా కూడా తీసిపోని విధంగా అక్రమ సంబంధాలు, విపరీతమైన చెడు ప్రచారాలు, ఆఖరికి శరీరాకృతిపై కూడా ఊరూవాడలా తలుపు తట్టి పుకార్లు షికార్లు చేస్తుంటే, ఓ చిన్న పొరపాటుకు తనకు ప్రయాత్శ్చిత్తమ్ చేసుకునే అవకాశం కూడా లేకపోయిందని, ఆ గాయని తన ఆత్మకథని ఆత్మహత్యాయత్నం చేసుకుందాం అని అన్ని వివరాలు తన తప్పు ఒప్పులను కూడా అందులో చేర్చి నిజాలను నిర్భయంగా ఒప్పుకొని తప్పు తన వైపు మాత్రమే కాదని ఇద్దరు కలిస్తేనే కదా తప్పు జరిగేది అని తెలిసినా సమాజం నుండి కేవలం గాయనీయే తప్పు చేసిందని ముద్ర వేస్తున్నా, సాటి మహిళలు, తండ్రి లాంటి వయసున్న పురుషులు, అన్నా అని పిలిచినా అనాలోచితంగా ఆలోచించే మానవ మృగాల నుంచి ఇక తప్పించుకోలేమని ఒక ఆలోచనకు వచ్చి తాను కూడా తనువు చాలిద్దామని తహతహలాడిపోయింది. ఈ తడబాటును గమనించిన తోటి బంధువులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అంతకంటే ఎక్కువగా అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తున్న వారు అడుగడుగునా ఆలోచనలను మారుస్తూ ముందుకు తీసుకెళ్తుంటే, గుండెకు తగిలిన గాయం, విరిగిన మనసు, భరించలేని ఆవేదన, బ్రతుకు మీద ఆశ సమాజం పట్ల చిన్నచూపు, మానవ మృగాల మీద మితిమీరిన కోపం ఉన్నా, “ఆడది అబల కాదు సబల” అన్నది కేవలం మాటలకే పరిమితం అని తెలిసిన సరే ఇంక పాటలు పాడుకుంటూ జీవిత పోరాటాన్ని కొనసాగిద్దాం అనుకుంటే, ఈ పోరాటంలో చేయని పొరపాటుకు సిగపట్లు పట్టుకొని కొట్టించుకోవలసిన పరిస్థితి ఈ కళా రంగంలో చోటు చేసుకుంది. ఒక గాయని ఇంకొక గాయనిని బహిరంగంగా దాడి చేసి బాధించటానికి వెనుక ఉన్న మానవ మృగాలు ఎవరో తెలిసినా దాడి చేసిన గాయని తాను కూడా ఒక ఆడదే అన్న ఆలోచన చేయలేకపోయింది. అంతిమంగా మానవ మృగాలు మానసిక ఆనందాన్ని పొందుతుంటే, ఇక్కడ మానవతుల పరువు బజారున పడుతుంది. ఇందుకు గల కారణాలు ఏమిటి, ఎందుకు, ఎలా?! అని ఆలోచన లేని స్థితి ఈ కళా రంగంలో ఉండటం గాయనీ గాయకులు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పాలి. ఎప్పుడు మారుతుందో ఈ కళా రంగం తీరు అని గాయపడ్డ గాయని ఆవేదనతో ఎదురు చూస్తూ ఉంది. …
ఇది ముగింపు కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article