Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలున్యాయమా నవ్వుల పాలవ్వకే…

న్యాయమా నవ్వుల పాలవ్వకే…

ఏది సమానత్వం… ఏది అసమానవత్వం..
ఏది స్వేచ్ఛ…ఎక్కడుంది ..ఎవరిస్తున్నారు స్వేచ్ఛ
ఏది గౌరవం ..ఏది అగౌరవం..
ఏది నేరం…ఏది ఘోరం…ఎందుకింత అఘోరం
ఏది రక్షణ… ఎక్కడుంది ఆడదానికి రక్షణ…
ఏది చట్టం..ఎక్కడుంది ఆడదానికి చట్టం…
ఏది న్యాయం… ఎక్కడుంది ఆడదానికి న్యాయం..
కాదంబరి కథ ఏమి చెబుతోంది…
కౌతా కథ కు కారకులెవరు..
డైరెక్టర్ హైదరాబాద్, కథ నటీనటులు బెజవాడ
నాడు శిరీష, నేడు సహన రేపేవరిదో

కృష్ణ సింధుప్రజాభూమి ప్రతినిధికల్చరల్&క్రైం

“ముదితల్ నేర్వగా రాని విద్య కలదే ముద్దర నేర్పించినన్”ఇక్కడ ముదిత అంటే స్త్రీ. ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు “బ్రతుకు ముల్లబాటలోన్ జతగాస్నేహితురాలవయ్తివి….కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి….వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి….పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.”….అని అన్నారు. కష్టంలో ముందుండి…. సుఖంలో క్రిందుండి….విజయంలో వెనకుండి ….ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ. స్త్రీని పూర్వ కాలంలో అబల అనగా బలం లేనిది అనేవారు. పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకొనేవారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లల యొక్క బాగోగులు చూసుకొనేవారు. ఆ విధంగా గృహిణి పాత్ర నూరు శాతం వహించేది. యుద్ధానికి వెళ్ళే పురుషులను ఆశీర్వదించేవారు. కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ, పురుషులకే పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు ‘సబల’ అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు.కానీ నేటి కళారంగం లో సభల కాదు అబల లాగే పరిస్థితి ఉంది.ఓ చిన్న పొరపాటు జీవితాన్నే చిన్నా భిన్నం అవుతుందని అనుకోలేదు. నకిలీ అకౌంట్ నిర్వహిస్తూ నాటకాలు చేస్తూ ఆ నాటకాలు కప్పి పుచ్చు కోవడానికి డైరెక్షన్ అక్కడ ఇస్తే కథ ఇక్కడ మొదలై కుమ్ములాటలకు సిద్ధమైతే ఇంకేమి న్యాయం దక్కుతుందో ఆలోచన చెయాలి. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది. అయితే స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర మాత్రం కాస్త తక్కువైందని, పిల్లలకు తల్లి శిక్షణ కొరవడిందని, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ దుర్వినియోగం వల్ల కుటుంబ వ్యవస్థ కాస్త బలహీన పడింది అని చెప్పవచ్చు.”యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఉన్నారు.మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు. ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న అతివ అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడం వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైయ్యారు. అనేకమైన దురాచారాలకు బలిపశువులయ్యారు. కొన్నాళ్ళు కన్యాశుల్కం సమస్య పీడించింది. వరకట్నం యిబ్బంది పెట్టింది. అయితే క్రమంగా మళ్ళీ ఆడవాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు. ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు.కానీ ఈ సాగె పయనం లో నయవంచకుల చేతిలో నలిగి పోక తప్పడం లేదు.నటి కాదంబరి జైత్వాని కేసు చూస్తే మహిళా లోకం సిగ్గు తో తలదించుకునేలా ఉంది.ప్రభుత్వమే ఇంతటి పాపానికి ఒడిగడితే ప్రజల్లో ఇంకేమి నమ్మకం ఉంటుందో ఆలోచన చేయాలి.దేశానికి ప్రధానమంత్రులయ్యారు, అవుతున్నారు.దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి – ” లేచింది మహిళా లోకం – నిద్ర చేచింది మహిళా లోకం – దద్దరిల్లింది పురుష ప్రపంచం” అన్నాడు. అంతకు ముందే ఇంకో పాత కవి “ముదితల్ నేర్వగరాని విద్య కలదే? ముద్దార నేర్పించినన్” అన్నాడు.అటువంటి మహిళలను అంతా మెచ్చుకోవలసిందే, ఆచరించవలసినదే. అటువంటి మెచ్చుకోతగ్గ మహిళలు ఎంతో మంది ఉన్నా ఏమి ఉపయోగం అన్న ఆవేదన కలుగుతోంది.అలనాటి మహిళల చరిత్రలు మరింతమందికి మరింత ప్రేరణ కలిగిస్తాయి అనుటలో సందేహం లేదు.ముఖ్యంగా మహిళలు మరింత ఉత్తేజాన్ని పొందాలి. అప్పుడే తల్లి ఋణం తీర్చుకున్న తృప్తి కలుగుతుంది. కానీ కళారంగం లో చోటు చేసుకున్న పరిస్థితి చూస్తే తృప్తి కంటే అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది.ఆడవాళ్ళు చదువుకుంటే ఎన్ని అధ్బుతాలు చేయవచ్చు.! మగవాడి చదువు అతనికే పరిమితం కానీ ఆడవాళ్ళ చదువు ఇంటింటి వెలుగు! ఆ వెలుగుకే మసక బారెలా చేస్తుంటే…రాయలసీమ లో జరిగిన అకృత్యాలు, గుంటూరు ఘటన బాపట్ల సంఘటన లు చూస్తే సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి.తెలుగు సాహిత్యంలో రెండు ఉద్యమాలు వ్యాప్తిచెందాయి. అందులో ఒకటి స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం. స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీలకు సామాజికపరమైన న్యాయం కోసం మొదలయ్యాయి.భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతుంది. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీ నీచంగా చిత్రించబడింది. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది.కానీ అది ప్రకటన లకే పరిమితం అయ్యింది.కామాతురాణాం నబయం నలజ్జ అన్నారు పెద్దలు.కామంతో కళ్ళుమూసుకుపోయిన వాడికి సిగ్గు సరం లేదని అర్థం. అలాంటి కామాంధులు పైకి చెల్లి అంటూ లోన చెలి గా చూస్తూ చిల్లర చేష్టలు చేసి ఎంతో మంది ని ముంచి చివరికి మునిగిపోయిన ఉదంతాలు ఉన్నా ఇంకా మారలేదు ఈ లోకం.పోలీసు రికార్డుల ప్రకారం భారతదేశంలో అధిక నేర సంఘటనలు మహిళలమీద జరుగుతున్నట్లుగా చూపుతున్నాయి. జాతీయ నేర నమోదు బ్యూరో 1998లో 2010నాటికి జనాభా వృద్ధి శాతం కంటే మహిళల మీద జరిగే నేరాల శాతం ఎక్కువగా ఉంటుందని నివేదించింది. ముందు అత్యాచారం, వేధింపుల కేసులలో సామాజిక నిందల కారణంగా చాలా కేసులు పోలిసులవద్ద నమోదయ్యేవి కావు.ఇప్పుడు కొంత మంది పోలీసుల తీరు వల్ల కేసుల నమోదు కాకుండా గోడ కుర్చీలతో సరిపెడుతున్నారు. అధికారిక గణాంకాలు మహిళల మీద జరుగుతున్న నేరాల నమోదులో నాటకీయ పెరుగుదల చూపిస్తున్నాయి.అధికారం డబ్బు వీటి ముందర కేసులలో నాటకీయ పరిణామాలు బోలెడు జరుగుతున్నాయి.1990 నమోదైన మొత్తం మహిళా కేసులలో సగానికి పైగా పని ప్రదేశాలలో బాధలు, వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. పురుషుడు స్త్రీని లైంగికంగా వేధించే లేదా బాధించే ప్రక్రియకు మరో పేరు ఈవ్ టీజింగ్. చాలామంది ఉద్యమకారులు మహిళలమీద పెరుగుతున్న లైంగిక వేధింపులకు కారణం “పాశ్చాత్య సంస్కృతి” ప్రభావమని ఆరోపిస్తున్నారు.సంస్కృతి తప్పుదొవ పట్టిస్తే అనాధిగా అత్యాచారాలు జరిగాయి గా. 1987లో ది ఇండిసేంట్ రిప్రజెంటేషన్ అఫ్ వుమెన్ చట్టం అమలయ్యింది. ఇది ప్రకటనల లేదా ప్రచురణలు, రచనలు, చిత్రలేఖనాలు, బొమ్మలు లేదా ఏ ఇతర పద్ధతులలోనైన మహిళల అసభ్య చిత్రీకరణను నిషేధించడానికి.1997లో మైలురాయి తీర్పుగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం, పని ప్రదేశాలలో మహిళల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గట్టి చర్య తీసుకుంది. వేధింపుల నివారణకు, పరిహారానికీ వివరణాత్మక మార్గదర్శకాలను కోర్టు సూచించింది. మహిళల జాతీయ కమిషన్ ఈమార్గదర్శకాలను విస్తరింపజేసి ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిగా మార్చింది.కానీ ఎన్ని చేసిన మానవ మృగాళ్ల నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని చెప్పాల్సిందే. నిన్న కడపలో జరిగిన ఉదంతం మొన్న గోళ్లపూడి లో జరిగిన ఘోర సంఘటన.. అమోన్న కౌతాలో జరిగిన దాడి.ఇలా చెప్పుకుంటు పోతే పేజీలు సరిపోవేమో అన్న అనుమానం ఆవేదన వ్యక్తమవుతోంది.ఇక స్త్రీ జీవితం మగవాడి దురహంకారానికి గురికాక తప్పదని స్పష్టమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article