పల్నాడు.. నూజండ్ల మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పువ్వాడ, ములకలూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాప చేసారు. పువ్వాడ వద్ద గుండ్లకమ్మపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. రూ.20.15 కోట్లతో గోకనకొండ-పువ్వాడ మధ్య గుండ్లకమ్మపై హైలెవెల్ వంతెన రాబోతుంది. అలాగే పువ్వాడలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రారంభించిన గొట్టిపాటి మాట్లాడుతూ.. కూటమికి వచ్చిన సీట్లు ప్రజల్లో మాపై ఉన్న నమ్మకం, ఆశలకు నిదర్శనం. ప్రజల్లో ఉన్న ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలానే కూటమి 120రోజులుగా పాలన. తొలిరోజే 5 సంతకాలతో సంక్షేమ శకానికి శ్రీకారం చుట్టిన సమర్థ పాలకుడు సీఎం చంద్రబాబు.175 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటుతో పేదల ఆకలి బాధలు తీర్చే ఏర్పాటు చేశారు. త్వరలోనే మెగా డీఎస్సీ పూర్తి చేసి 6,350 మందికి టీచర్లుగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. పెద్దఎత్తున కంపెనీలు, పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో మంత్రి లోకేష్ అమెరికా పర్యటన అని రవికుమార్ పేర్కొన్నారు.