ఇంటి అనుమతి తో షెడ్ నిర్మించకోవచ్చా..
ఐరన్ యార్డ్ లో అనుమతులు ఎవరిచ్చారు..
చలనాతో షెడ్ లు నిర్మించ కోవచ్చా…
ఆ ప్రసాద్ దోచుకున్నాడు…ఈ ప్రసాద్ చూసాడు..
గంధం అందరికి గంధం పూస్తే…
ఈ సిటీ ప్లానర్ ప్రసాద్ చక్కగా సరిచేస్తుంటే..
43 వ డివిజన్ లో అక్రమాలు చూడతరమా..
ఆయనతో వీరికి ఆమ్యామ్య లు ఉన్నాయా..
కూటమిలో కూడా వైసీపీదే హవానా
ధ్యాన చంద్రగారు మీ దగ్గర సమాచారం ఉందా..
మీ ప్రక్కనే అవినీతి పరులుంటే…
ప్రక్షాళన సాధ్యమే అనుకుంటున్నారా..
ప్రసాద్ ల అవినీతి పాచిపోయినట్లేనా..
పురపాలక శాఖలో అవినీతి పురుగులకు మందు లేదా..
సమీక్షలు కేవలం చప్పట్లు కొట్టుకోవడానికేనా..
కమిషనర్ గారు కాగితాలు చూడండి..
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
పట్టణంలో అక్రమ నిర్మాణాలు పై పటిష్ట మైన చర్యలు తీసుకోవాలని అక్రమాలు ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని అందుకు సచివాలయ సిబ్బంది తో అనుసరించాలనిపురపాలక శాఖ కమిషనర్ సమీక్ష లో తెలియపరచడం జరిగింది. ఇది విన్న పురపాలక ప్రజలు అవునా అని పక్కున నవ్వుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. అవినీతి అంతా పట్టణ ప్రణాళిక శాఖలోనే ఉంటే అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోసేది వారే అయితే ఇంకెక్కడా అక్రమాలు కట్టడి చేస్తారని కమిషనర్ మాటలపై పెదవి విరుస్తున్నారు ప్రజలు. ఏమున్నది ఏమున్నది ఎటూ చూసిన అవినీతి అక్రమ కట్టడాలే అగుపిస్తోంటే అందుకు కనీస చలానా లు కూడా కట్టించకుండానే కట్టడాలకు అనుమతులు ఇస్తూ కాసులు లాక్కుంటే కట్టడి చేసే వారు ఇంకేవరన్నది అర్థం చేసుకోవచ్చు. నిర్మిస్తున్న నిర్మాణాలు ఏది సక్రమం ఏది అక్రమం అనేది తెలియకుండా సచివాలయ సిబ్బంది మొదలు అనుమతుల ఇచ్చే అధికారుల వరకు సంచులు నింపుకుంటూ సంతకాలు చేస్తూ చేష్టలుడిగి న పనులు చేస్తుంటే ఇక సచివాలయ సిబ్బంది సిటిప్లానర్ లను ఏమి చేస్తారో చూడతరమా అని పురపాలక ప్రజలు చర్చించుకుంటున్నారు. మచ్చుకకు కొన్ని చూస్తే భవానిపురం ఐరన్ యార్డ్ 43 డివిజన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న ఆడిగేనాదుడు లేక పోయారు. అక్కడి కార్పొరేటర్ అండదండలతో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఇక అడ్డుకట్ట వేసేందుకు ముందుకురాకపోవడం విశేషం. రాష్ట్రంలో ఉన్న పురపాలక శాఖ లో ఉన్న అధికారులలో అత్యంత అవినీతి పరుల ఖాతాలో నమోదు చేసుకున్న రిటైర్డ్ టీపీఓ గంధం ప్రసాద్ పర్యవేక్షణ సిటీ ప్లానర్ సూపర్ విజన్ లో 43 వడివిజన్ లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు బోలెడు జరిగాయి.
ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అక్కడ చూస్తే కింద వ్యాపార సంస్థ పైన గృహ సముదాయం. అక్కడే ఇంకొక షెడ్ నిర్మాణం. వీటికి చలానాలు కట్టింది ఎంత పురపాలక శాఖకు ఆదాయం చేకూర్చింది ఎంత అంటే నాటి గంధం ప్రసాద్ అందరికి గంధం నామాలు పూసి తన జేబులు నింపుకొని అందుకు అండగా ఉన్న స్థానిక కార్పొరేటర్ లకు వాటాలు పంచుకుని పండగ చేసుకుంటుంటే పట్టణ ప్రణాళిక శాఖ పరుగులు పెట్టాలంటే ఎక్కడికి పరుగులు పెట్టాలో పురపాలక శాఖ కమిషనర్ చెప్పాలి మరి.ఇక సిటీ ప్లానర్ సంగతి చెప్పిన అలివికానిది.గతంలో ఉన్న టిపిఓ ఒక ఇంటి నిర్మాణ విషయంలో పోలీసుకాలనిలో పత్రికా కధనం వస్తే కూల్చివేస్తే సిటీప్లానర్ చర్యలు చేపట్టి స్థానిక సిబ్బంది పై సస్పెన్స్ సరెండర్ చేసి మల్లి అదే బీల్డింగ్ పూర్తి చేయించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఇక ఏసీపీ డీసీపీ లు ఉన్నా దోచుకుని దాచుకోవడమే సరిపోతుంటే ఇక అక్రమ నిర్మాణాలు ఆగేది ఎలా అన్నది డాలర్ల ప్రశ్న.ఈ నేపధ్యంలో ధ్యాన చంద్ర గారు ఏమి ధ్యాస పెడతారో వేచిచూడాలి.