Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలునాలుగో స్తంభం నీతి తప్పిపోయిందా..

నాలుగో స్తంభం నీతి తప్పిపోయిందా..

రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు నొక్కుతోందా..
లేక నాలుగో స్తంభమే నడివీదిలో నాట్యమాడుతుందా..
చేష్టలుడిగి సిగ్గువిడిచి గతి తప్పుతోందా…
అసలు వదిలి నకీలీల కి ప్రాధాన్యాత ఇవ్వడమేమిటీ…
ఇదేనా అధికారుల చిత్తశుద్ధి ..
ఇప్పుడున్నది జర్నలిజమేనా…
జర్నలిజమే అయితే ఇంత దిగజారి ఎందుకు పోయింది…
జర్నలిజంను యర్నలిజం…బ్రోకరిజం..బ్లాక్ మెయిలిజం గా మార్చిందెవరు..
ఎందుకింత దుర్భిక్షం… ఏమిటీ దుర్లభం..
వీరితోనేనా జర్నలిజం బ్రతికి బట్టకట్టేది..
ఇకనైనా మారండి రా అయ్యా..
మీ సిగ్గుమాలిన నీతి మాటలు మానండి..
మానవత్వం ఉన్న మనుషులుగా ఉండండి..
ఇక మీ దిగజరుడుతనం తగ్గించుకోండి…

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
నాలుగో స్తంభం ప్రమాదంలోకి నెట్టబడుతోందా…నెట్టవేయబడిందా…లేక నెట్టి వేయడానికే సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది .సమాజానికి అవసరమైన వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నాయా లేక ప్రజాస్వామ్యాన్ని భక్షించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయా అంటే నిజమే నన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను కూల్చి వేస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అందుకేమో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిదప రాజకీయ ,అధికార ,పార్లమెంటరి విధానాలతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయులు పాలనను గుర్తుతెచ్చుకొంటారని ఆనాడే చక్రవర్తి రాజగోపాలచారి చెప్పింది నిజమేనని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో వినిపిస్తోంది. అందుకు గల కారణాలు లేకపోలేదు.ప్రజలను ఉద్ధరించడానికే చట్టాలు ఉన్నాయని చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేకపోయింది. చట్టాలు అమలుకు కీలకమైన ఆదేశాలు ఇవ్వాల్సిన వ్యవస్థ చేష్టలుడిగి ఉండి పోక తప్పడం లేదు.ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటే ఈ ప్రజాప్రతినిధులు తమ కడుపు నింపు కోవాడానికే పరిమితము అవుతూ సమాజానికి మూలమైన వ్యవస్థ లలో ఒక న్యాయవ్యవస్థను కొంత మినహాయింపు ఇస్తే మిగిలిన అన్ని వ్యవస్థలను తమ అరిపాదాల కింద పెట్టుకున్నారా అన్న విధానానికి ప్రజలు ఆలోచించే స్థాయికి తీసుక వచ్చారు. దీనికి కారణం సమాజంలో ఏ స్తంబానికి హానీ జరిగిన అండగా ఉండి ప్రజా చైతన్యం తీసుక రాగలిగిన నాలుగో స్తంభం నడివీదిలో అంగడి సరుకుగా మారింది. ఇందులో వాస్తవం లేక పోలేదు.కులం, మతం వారిగా విడిపోయి తమ ఆర్థిక ప్రయోనాల కోసం అర్రులు చాచుతూ అడగకుండానే రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నాయి. మితి మీరిన ధనదాహం.దానికి తోడు ఈప్రజల్ని శాసించగల సత్తా తమకే ఉండాలన్న కులజాడ్యపు అహంకార ఘీంకారా బలుపు. అలా కాక పోతే మీడియా పాత్ర ఏమిటీ,మీడియాను సమ సమాజం సక్రమంగా నడవడానికే నాలుగో స్తంభం ఉండేది. తప్పు చేస్తే మీడియా ప్రజాక్షేత్రంలో ఎండగడితే మనుగడ కష్టమవుతుందన్న భయం ఉండేది.ఇప్పుడు అదే మీడియా తన విలువలను దిగజార్చు కుంటుంటే మిగిలిన వ్యవస్థలు హాయిగా నవ్వుకుంటూ నట్టనడి వీధిలో నాకెవ్వరు అడ్డులేరన్న ధోరణి కి వచ్చేసాయి.కొంతమంది స్వార్ధ పరుల తమ స్వార్ధ ప్రయోజనాలకోసం నాలుగో స్తంభాన్ని నాయకుల పాదాల కింద ఉంచి పరువు ప్రతిష్ట అంటూ పులిహోర కబుర్లు చెబుతూ అక్షర జ్ఞానం లేని ఆవివేకులను అడ్డా గా చేసుకుని ఆగడాలు చేస్తుంటే అందరి మెప్పులు పొందే అక్షర వ్యవస్థ అన్యాయానికి గురువుతుంది.
జర్నలిజం ను యర్నలిజంగా బ్రోకరిజం గా మారడానికి ఇలాంటి నేతలు కారణముకాదా అన్న అనుమానాలు ఎందుకు వ్యక్తం చేయకూడదో చెప్పాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.అది అందరిది అంటే కాదు కొందరిదే అన్న పెడదోరణి కి పెద్ద లని చెప్పుకునే వారు ఎందుకు దిగజారి పోయారో అర్థం కానీ పరిస్థితి. అందరి పెద్దరికాలు ప్రాధాన్యత పై పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసే ఉత్తమోత్తమ నాయకులు ఇలా ఉత్తుత్తిమాటలు చెబుతూ ఉపయోగం లేని విదంగా ప్రవర్తిస్తుంటే పరువు పోతుందే తప్ప ఇంకేమి లేదన్నది జగమెరిగిన సత్యం.ఇప్పటికయినా బాధ్యత గల వృత్తిలో ఉండి తమ ప్రవృత్తిని అంటించి పతనావస్థకు దిగజారి పోతున్న పవిత్ర జర్నలిజం ను మరింత భ్రష్టుపటించడం మానుకోవాలని పలువురు ప్రముఖులు హితవు పలకుతున్నారు.ఇకనైనా మారి సమాజంలో ఉన్న లోపాలు సరిచేయక పోయినా పర్వాలేదు కానీ చతికిల బడ్డ జర్నలిజాన్ని జనానికి అందించాలనే ఆలోచన చేయాలని యర్నలిజం లేని జర్నలిజం కోరుకుంటుంది.మారితే మంచిది మరకపోతే మూల్యం చెల్లించక తప్పదని కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article