ఎందుకింత నిర్లక్ష్యం.. ఏమిటీ వీరి నిర్వాకం..
మహిళలంటే చిన్న చూపా లేక గౌరవమే లేదా..
చచ్చి పోతేనో లేక ఇంకేదయినా జరిగితేనే…
పేరుకేనా మహిళా హోం మంత్రి
ఇలా అయితే మహిళా రక్షణ కాదు భక్షనే…
ఇంకెప్పుడు మారతారు వీరు…
వీరితో రక్షణ కష్టమేమో..
ఇక న్యాయమన్నది కాగితాలలో రాసు కోవడానికే ..
ఎందుకిలా.. ఏమిటీ ఇలా
(కృష్ణ సింధు,ప్రజాభూమి ప్రతినిధి,క్రైం)
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత. వారు స్థానిక, ప్రాంతీయ లేదా జాతీయ పోలీసు బలగాలు వంటి ప్రభుత్వ సంస్థలు లేదా విభాగాల కోసం పని చేస్తారు, పోలీసు అధికారులు సాధారణంగా ఆత్మరక్షణ, తుపాకీలను ఉపయోగించడం, అరెస్టు విధానాలు, ట్రాఫిక్ నియంత్రణ, గుంపు నియంత్రణ, అత్యవసర ప్రతిస్పందన వంటి వాటిని నిర్వహిస్తూ ఉంటారు.భద్రతను పరిశీలిస్తున్న పోలీస్వారి విధుల్లో తరచుగా కేటాయించిన ప్రాంతాలలో పెట్రోలింగ్, అత్యవసర కాల్‌లు, సంఘటనలకు ప్రతిస్పందించడం, నేరాలను పరిశోధించడం, అనుమానితులను ఇంటర్వ్యూ చేయడం, సాక్ష్యాలను సేకరించడం, అరెస్టులు చేయడం, కోర్టులో సాక్ష్యమివ్వడం, ఇతర చట్టాన్ని అమలు చేసే సంస్థలు, సిబ్బందితో కలిసి పనిచేయడం వంటివి ఉంటాయి.సమాజంలో పోలీసుల పాత్ర సాధారణంగా ప్రజా భద్రతను నిర్వహించడం, చట్ట నియమాలను సమర్థించడం, అయితే వారి బాధ్యతలు, అధికారాలు వారు సేవ చేసే దేశం లేదా ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.కానీ అదే పోలీస్ అందుకు భిన్నంగా మారిపోయిందనే అపవాదు మూటగట్టుకొంటోంది.ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న సంఘటనలు పునరావృతం కాకుండా చేయడం లో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లు కూడా వదంతులు వినిపిస్తున్నాయి. నేరాలు కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్నా ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఆశించి లేక నిర్లక్ష్యం లేక తమ వ్యక్తిగత భావాలను అపాదించి అబలకు అన్యాయం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.ఇందుకు ఉదాహరణ గా సత్యనారాయణ పురం పోలీసుల నిర్లక్ష్యం చూస్తేనే అర్ధమవుతుంది. వందలాదిమంది ప్రేక్షకుల మధ్య అక్కడ జరుగుతున్న కార్యక్రమంతో సంబంధం లేకున్నా తాను ఓ మహిళా అనే విషయాన్ని కూడా మరిచి సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేసి చంపే ప్రయత్నం చేసినా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఉన్నారంటే ఇదేనా మహిళల పట్ల పోలీసులకు ఉన్న చిత్తశుద్ది అన్నది తెలియవస్తుంది.ఇందుకేగా సమాజంలో అనేక రకాల పరిణామాలు జరిగేది.నటి కాదంబరి జైత్వాని ఉదంతంలో పోలీసులే అన్యాయం చేశారని ఐపీఎస్ లను సస్పెండ్ చేయడం చూస్తే ఇంకెక్కడ మహిళలకు న్యాయం జరుగుతుందనేది ఆలోచన చేయాల్సిందే.ఇంకెంత మంది పోలీసులను సస్పెండ్ చేస్తే న్యాయం జరుగుతుందో అంటే ఆ వ్యవస్థ పై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లిపోతుంది. కొంతమంది పోలీసుల కారణం గా మొత్తం వ్యవస్థ కే మాయని మచ్చగా మారుతుంటే మారదు ఈలోకం అన్న ధోరణికి వచ్చేస్తోంది ఈ సమాజం.కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే.మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పురుషులకు ఒక ఆచారం, శతాబ్దాలుగా ఈ అన్యాయమైన చికిత్స కొనసాగుతోంది. స్త్రీలకు ఆస్తి ఉండకూడదు, వారి స్వంత తల్లిదండ్రుల ఆస్తులలో వారికి వాటా ఉండదు, వారు ఓటు హక్కును ఎన్నడూ అనుభవించలేదు. వారి స్వంత జీవనశైలి లేదా ఉద్యోగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు.ఇప్పుడు మహిళా సాధికారత అంటే వారి శక్తిని, స్వంత పనులు చేసుకోగలుగుతున్నారు.అంటే స్వంత భౌతిక ఆస్తులు, మేధో వనరులు స్వంత భావజాలాలపై నియంత్రణ కలిగి ఉండటం లాంటివి.ప్రాచీన భారతీయ కాలంలో మహిళా సాధికారతప్రాచీన భారతీయ సంస్కృతిలో స్త్రీలను పురుషులతో సమానంగా పరిగనించారు. లింగ వివక్ష లేదు, దానికి బదులుగా స్త్రీలను సమాజం గౌరవించింది. ఆ సమయంలో సమాజం స్త్రీలను తల్లిగా పరిగణించింది. విద్యను స్వీకరించడానికి స్వేచ్ఛగా ఉన్న వారి పూర్తి ప్రాథమిక హక్కులను అనుభవించేవారు, ఆ సమయంలో ఋషుల భార్యలు తమ భర్తలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడతారు, వారిని అర్ధాంగిని అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో పురుషులు జీవించినట్లే స్త్రీలు కూడా సమాన జీవితాన్ని గడపవలసి వచ్చింది. భారతీయ చరిత్రలో స్త్రీలు తమ జీవితంలో రెండు విషయాలను ఎదుర్కొన్నారు, ఒకటి లొంగడం మరియు విముక్తి. కాలక్రమేణా, వారి స్థానాలు మారవచ్చు కానీ వేద యుగంలో, వారు మరణాలు ఆదర్శాలను రక్షించే సంరక్షకులకు పూర్తి చిహ్నంగా ఉన్నారు.గార్గి, మైత్రేయి, సీత, ద్రౌపది అలప యొక్క సాఫల్యం ఈ యుగపు మహిళలకు అత్యంత ఆదర్శవంతమైన పాత్రగా మారుతుంది. ఈ స్త్రీలు అనేక రంగాలలో పురుషులతో పోటీ పడేవారు వారి హక్కులు సమానత్వాన్ని పొందారు ఆనందించారు, వారిపై ఎటువంటి పరిమితులు లేవు వారు గొప్ప సంపద ,ఆస్తిని కలిగి ఉన్నారు. దానితో పాటు, వారి సంతానానికి మార్గనిర్దేశం చేసే విషయంలో కూడా వారు చాలా బలంగా చెప్పేవారు.వేదాల యొక్క పురాతన గ్రంథంలో, మానవుల భావన సమాజానికి పునాది, తైత్తిరీయ సంహితలో స్త్రీ పురుషులు బండికి ద్విచక్రంగా పరిగణించబడ్డారు. వేదాలు సమాజానికి అందించిన ఈ పాఠాలు స్త్రీ పురుషుల మధ్య సమానత్వానికి మంచి ఉదాహరణలు.ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆనాటి నుండి నేటి యుగం వరకు మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల తీరు ఆక్షేపనీయంగా ఉంది.మహిళలు ఓ వైపు రాణిస్తున్న మరో వైపు రక్షణ లేక నరరూప రాక్షసుల చేతిలో రాలిపోతున్నారు.దీనికి ముగింపు ఉంటుందా అంటే మౌనమే సమాధానం. ఈ మౌనం ఎందుకో మరి .