టపాసుల్లో తిక మక పెట్టి అమ్మేవారికా
అధిక రేట్లకు అమ్మినా కొన్నవారికా
అవకతవకలు ఉన్నా ఆదమరుస్తున్న అధికారులుకా
ఐడి కార్డు చూపించి అందిన కాడికి దోచుకున్న వారికా
అనుమతులు ఒకటి అమ్మేది ఇంకొకటి వారికా
అసోసియేషన్ అని చెప్పి అందరిని గుప్పిట్లో ఉంచుకున్న వారికా
అవి అసలివా నకిలివా అన్న ఆలోచన లేని వారికా…
అందరూ కలిసి మోసం చేసినా ఏమిచేయలేని ప్రజలదా
అమావాస్య చీకట్లు తొలగిస్తున్నారా…కళ్ళకు కట్టుతున్నారా..
అందరి కళ్ళల్లో వెలుగులు నింపుతార …
ఉన్న వెలుగును దూరం చేస్తారా…
ఈ వెలుగులు ఎవరికి లాభం… ఎవరికి నష్టం…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశి జరుపుకుంటారు ఇంతటి విశిష్టత ఉన్న మహపర్వదినాన్ని కొంతమంది మహానుభావులు ఏ విదంగా జరుపుకునే వెసులుబాటు చేస్తున్నారంటే అది అప్పటి నరకాసురిడే ఎంతో మేలు అన్న విదంగా ఉంది. కారణం ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు అన్ని వ్యవస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పాల్సిందే. దీపావళి అంటే గతంలో ప్రతి ఇంటిలో నూనె దీపాలు వెలిగించి ఊరు వాడ వెలుగులు నింపుకొని అమ్మవారిని కొలుచుకుని ఈ వెలుగులు సంపూర్ణంగా ఉండేలా చూడాలని ప్రార్ధించేవారు. వీటికి తోడు టపాసులు దీపావళి బాంబులు పీల్చుకుని సంబరాలు చేసుకునేవారు కానీ నేడు దీపావళి వెలుగులు ఎవరికి అంటే అదేమిటీ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీపావళి వెలుగులు పేరిట రూపాయిది పది రూపాయలు అమ్మి సొమ్ము చేసుకునే వారికా లేక అనుమతులు ఇచ్చాం ఇక అన్నీ సక్రమంగా ఉన్నాయని చెతులు దులుపుకొనేవారికా లేక ఏమి జరిగితే మాకెమి జరిగినప్పుడు చూద్దాం అప్పుడు అన్నీ వ్యవస్థ లను మ్యానిపులేట్ చేద్దామంటూ మేమున్నాం వారి వెనుక అని అక్కడ జరిగే అన్యాయం లో పాలుపంచుకునే వారికా అన్నది అర్థం కానీ పరిస్థితి. సమాజంలో ఏ చిన్న అవకాశం ఉంటే దానిని నగదు రూపేణా మార్చుకునే ఈ రోజుల్లో కట్టడి చేయాల్సిన వ్యవస్థలు కూడా చోద్యం చూస్తూ ఉన్నాయని చెప్పడం లో సందేహం అక్కర్లేదు. అంతిమంగా ప్రజలే అన్నీ నష్టపోవడమే జరుగుతుంది. అసలు టపాసులకు జీఎస్టీ ఉంటుందా ఉంటే ఎలా పరిగణనలోకి తీసుకంటారు.రేట్లు అధిక ధరలు ఉన్నాయా లేక ప్రజలకు అందుబాటులో ఉన్నాయా అనేది ఎవరు నిర్దారించేది.ఒక వేల నిర్దారిస్తే ఆ నిర్దారణ ప్రకారం అక్కడ లావాదేవీలు జరుగుతున్నాయా లేదా అన్నది చూసి అక్కడ ఏదయినా లోపం ఉంటే కట్టడి చేసే అధికారులు ఎక్కడ ఉన్నారన్నది డాలర్ల ప్రశ్న. బెజవాడ భవనిపురం లో ఉన్న టపాసుల వ్యాపారి ఒకరు ఇప్పటికే దాదాపు రెండు లక్షల రూపాయలు పత్రికా వ్యవస్థ కు ఇచ్చుకున్నాము ఇందులో ఏది అసలు ఏది ఒరిజినల్ అనేది నిర్దారణ చేస్తే ఇంకో యాబై వేల రూపాయలు ఇస్తామని ఈ ఓ పాత్రికేయుడి దగ్గర వాపోవడం విడ్డురంగా ఉంది. ఇలా అయితే గన్నవరం తో పాటు ఇతర ప్రాంతాల్లో ఇంకెన్ని లక్జలు చెల్లించుకున్నారు. ఇక మిగిలిన వ్యవస్థలకు ఇంకెన్ని లక్షలు చెల్లించారనేది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి వెలుగులు అని ప్రజల మనోభవాలతో చెలగాటం ఆడుతూ ఉత్తుత్తి మాటలు మాట్లాడేవారికి ఆ అమ్మవారే అన్నీ చూడాలని పలువురు ప్రజలు వేడుకొంటున్నారు.