కూన పై రాజకీయ కుల కుట్ర నిజమేనా?
ప్రజాభూమి ప్రతినిధి,శ్రీకాకుళం:
రాజకియాలలో ఎత్తులకు పై ఎత్తులు సహాజం అధికార ప్రతిపక్ష పార్టీలు మధ్య వ్యూహ ప్రతి వ్యూహాలు ప్రత్యర్ది వ్యూహాలకు అందకండా ప్రణాళికలు ఉంటాయి. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం స్వపక్షంలో మంత్రులుగా ఉన్న బాబాయ్ అబ్బాయిలు సిక్కోలు టిడిపి కీలక నేతను టార్గెట్ చేస్తున్నారట. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ నేతకు అడుగడుగునా అడ్డుపడుతున్నారట ఆ నేతకు నీడల చిన్న పొరపాటున కూడా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారట ఇంతకీ ఎవరా నేత…. శ్రీకాకుళం జిల్లా లో టిడిపికి కష్టకాలంలో అండగా నిలబడ్డ వ్యక్తులలో కూన రవి కుమార్ ఒకరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తనదైన శైలిలో నాటి వైసిపి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఈ క్రమంలో పదుల సంఖ్య లో పోలీసు కేసులు సైతం ఎదుర్కొన్నారు. టిడిపిలో కీలక వ్యక్తిగా మారిన ఎమ్మెల్యే కూన రవికుమార్ , పార్టీ అధికారంలోకి వచ్చాక అధిష్టానం లైట్ తీసుకుందట. బలమైన సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించి చివరి క్షణంలో చేజారి పోయినది పొలిటికల్ గా మరో మెట్టు ఎక్కకుండా సర్వశక్తులు ఒడ్డి అడ్డుకుంటున్నారట ఆమంత్రులు. మంత్రి పదవి ఆశించి బంగపడ్డ కూనకు అధిష్టానం మంచి కార్పొరేషన్ పదవిని అందిస్తుందని బావించారు. కానీ తాము ఉండగా జిల్లాలో మరో పవర్ సెంటర్ ఎందుకు అనుకున్నారో ఏంటో తమ పలుకుబడితోసక్సెస్ పుల్ గా అడ్డుకున్నారట. ఏ పదవి దక్ఖుండా మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ను త్రొక్కే ప్రయత్నం చేస్తున్నారట బాబాయ్ అబ్బాయ్. సిక్కోలు టిడిపిలో అంతర్గత పోరు సరా మామూలే. దశాబ్దాలుగా ఆ విభేదాలు కొనసాగుతూ వచ్చాయ్ , కిమిడి కళా వెంకట్రావ్ గ్రూప్ వర్సెస్ కింజరాపు ప్యామిలీ గా ఉండేది 2024 సార్వత్రిక ఎన్నికల్లో కళా వెంకట్రావు విజయనగరం నుంచి పోటీకి దించిన అధిష్టానం పూర్తిగా విజయనగరం కే పరిమితం అయ్యారు కళా వెంకట్రావు ఇప్పుడు కళా వెంకట్రావు ప్లేసును భర్తీ చేస్తూ కూన వర్సెస్ కింజరాపు వార్ నడుస్తుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి నేడు కేంధ్ర , రాష్ర్ట ప్రభుత్వాలలో మంత్రులుగా ఉన్న రామ్మెహాన్‌నాయుడు , అచ్చెంనాయుడులు పొలిటికల్ గా మరో పవర్ సెంటర్ తయారు కాకుండా జిల్లాలో జాగ్రత్త పడుతున్నారట. అందులో బాగంగానే అధినేత బాబు వద్ద తమ పలుకుబడిని కూన రవికుమార్ కు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారన్నది జిల్లా తెలుగు తమ్ముళ్ల మాట ఈ మధ్యన శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియాను కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఒక్క కూన రవికుమార్ నియోజకవర్గంలో జరుగుతున్నట్లు కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి కూన రవి మీద పదేపదే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయించి అధినాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర రవి కుమార్ గ్రాఫ్ ను పూర్తిగా తగ్గించాలి అని దృఢ సంకల్పంతో రవికుమార్ కు వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడ రవికుమార్ అనుచరులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొన్నది.శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో కుల ప్రధాన్యత అధికం కాలింగ , వెలమ తూర్పుకాపుల హావానడుస్తుంది.
ఈ మూడు బిసి కులాల మద్య ఆదిపత్యం నడుస్తుంది. మాజీ స్పీకర్ తమ్మినేని పై విజయం సాదించడంతో కూన రవికుమార్ కు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది అని అనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా కింజరాపు ప్యామిలిలో కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు పొందారు. అమాత్య యొగం దక్కని కూనరవికుమార్ కు మంచి నామినేటెడ్ పోస్ట్ లభిస్తుందని ఆశించారు. కానీ అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి చందాన , ప్రధాన కార్పోరేషన్లు చైర్మెన్ పదవులు ఒక్కొటి కట్టబెట్టెస్తున్నారు అధినేత. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన కూనకు పార్టీ అధినాయకత్వం జలక్ ఇస్తుందని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట. రవికి పదవులు అందినట్టే అంది చేజారటం వెనుక అదృష్య హస్తాలు శ్రీకాకుళం జిల్లాకే చెందిన మంత్రులుగా బావిస్తున్నారు కూన అభిమానులు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటావో కింజరాపు కూన వార్ ముగింపు ఎప్పుడు పలకబోతుందో అని ఆసక్తిగా శ్రీకాకుళం ప్రజలు ఎదురుచూస్తున్నారు రెండవ విడత కార్పోరేషన్ పదవుల్లో కూన రవికుమార్ కు అవకాశం వచ్చేనా లేదా మంత్రుల పనితీరు బాగోలేదని అధినాయకుడు నలుగురు మంత్రులు టార్గెట్ చేశారని వస్తున్న వార్తలు నిజమైతే రానున్న మంత్రివర్గ విస్తరణలో కూన రవికుమార్ కు మంత్రి యోగం దక్కేన జిల్లాలో బలమైన సామాజిక వర్గం కల నెరవేరేనా టిడిపి పార్టీ అధినేత మనసులో ఏముందో , జిల్లాలో పార్టీని ముందుకు నడిపించడంలో ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయన్నది వేచి చూడాల్సిందే….