ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అంటే ఖర్జూరాలను రోజూ తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఖర్జూరాలను రోజూ తింటే పైల్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్ని మన ఎముకల్ని, దంతాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. రోజూ ఖర్జూరాలను తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. వీటికి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు ప్రాణాలకు చాలా ప్రమాదం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఖర్జూరాలు హై బీపీని నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. ఖర్జూరాల్లో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు బీపీని కంట్రోల్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. వీటిని రోజూ తినడం వల్ల హైపర్ టెన్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఖర్జూరాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఖర్జూరాల్లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మీరు ఈ ఖర్జూరాలను రోజూ తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాలు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. రోజూ ఖర్జూరాలను తినడం వల్ల మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఉండే విటమిన్-బి, కోలిన్ మీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎన్నివిధాలుగా మేలు చేసినా.. వీటిని రోజుకు 3-4 ఖర్జూరాలకు మించి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని నీళ్లు లేదా పాలలో నానబెట్టి తింటే మరిన్ని ప్రయోజనాలను పొందుతారు.