నేటి రాజకీయాలకు సాటిరారెవరు మరి…?
అభిమానంగా పోస్టింగ్ అంతే స్పీడ్ గా ఊస్టింగ్..
రాజ్యాంగ సూత్రాలు కాగితాలకే… అమలుకు కాదు..
ఆలస్యం అయితే అధికారి పార్టీకి కోపం..
తొందరపడితే నిందలు పడక తప్పడంలేదు..
ఇంకొంతమంది ఐపీఎఎస్ ల అత్యుత్సాహం..
ఆఖరికి అన్నీ అగచాట్లు…అన్నీ విమర్శలు ..
అంతా అయోమయం..జగమంతా జగన్మాయం..
నిజంగానే పోలీసులు తప్పు చేస్తున్నారా..
తడబాటుకు గురవుతున్నారా..
మరి తొందరపాటు తెలియని ప్రజలు తోనేనా…
వృత్తి ధర్మం విస్మరించి ప్రవర్తిస్తుంటే…
విమర్శలు కాక విరజాజి పూలు వస్తాయా…
మారాల్సింది నేతలా.. ప్రభుత్వాధినేతలా…
ఇలా పాలకుల తీరు ప్రజలకు శాపమా వరమా..
ఏది చట్టం…ఎవరికి చుట్టం ..ఎందుకింత చిట్టా…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
భారత రాజ్యాంగం ఎంత గొప్పది అయినా దానిని అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు చెడ్డవాడైతే చెడు ఫలితాలు వస్తాయని ఆయితే ఏది కూడా రాజ్యాంగానికి అపాదించడం అంత సమంజసం కాదని రాజ్యాంగ నిర్మాత ఆనాడే చెప్పి యున్నారు.మరి అదే రాజ్యాంగ స్పూర్తితో పనిచేస్తున్నామని చెప్పే ప్రతి వ్యవస్థ లో పనిచేసే వారు ఎందుకు ఇలా అవుతున్నారో అర్థం కావడం లేదు. అసలు రాజ్యాంగమనేది ప్రభుత్వ సంవిధానం. సాధారణంగా వ్రాతపూర్వకంగా వుంటుంది. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగపరమైన విధులు, విధానాలూ పొందుపరచబడి వుంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం అనేది శరీరమైతే, రాజ్యాంగం అనేది ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం. ఇన్ని ప్రమాణికాలు కలిగి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పే మాటలు రాసుకోవడానికే తప్ప ఆచరణలో కనబడకపోవడం ఆచ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో రాను రాను ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కంటే ఎవరికి వారు వెలిగులు నింపుకొని సంబర పడే పరిస్థితి దాపురించింది. స్వాతంత్ర్యము వచ్చిందని వేడుకలు చేసుకోవడం తప్ప నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్య ము ఇంకా అట్టడుగు వర్గాలకి సిద్దించ లేదని చెప్పాలి.దీనికి తోడు రాజకీయ పార్టీల పోరు ఎక్కువ అవ్వడం మూలాన ప్రజలకు అనువుగా ఉండాల్సిన ఎగ్జిక్యూటివ్ లేజిస్టర్స్, అడ్మినిస్ట్రేషన్ లు సరైన గాడిలో పెట్టేందుకు రాజ్యాంగ అమలు సరిగా లేదన్న వాదన లేకపోలేదు. ఇక అసలు విషయం కొస్తే టోపీ మీద ఉన్న మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపం అయితే కనిపించని నాలుగో సింహం పోలీస్ అన్న సాయి కుమార్ డైలాగ్ సినిమా హిట్ కోసం బాగుందే తప్ప నవ్యాంధ్రప్రదేశ్ లో నాలుగో సింహం నవ్వుల పాలవుతున్న సంఘటన లు చోటుచేసుకుంతున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు.రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే నాలుగో సింహాన్ని నలిపేస్తున్నారా లేక కావాలనే అలా చేస్తున్నారా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం ప్రజలు ఇచ్చే తీర్పుతో అధికారాన్ని చేపట్టడం మామూలే. అధికారం చేపట్టిన తరువాత ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ కు అనుకూలంగా ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వడం పరిపాటి గా వస్తున్న ఆచారమే. ఈ ఆచారం అనాధిగా ఉన్నా నేడు మితిమీరిన స్వామి భక్తి ఎక్కువ అవ్వడం ఇటు ప్రజలకు అటు అధికార వ్యవస్థ కు ఆగచాట్లు తెచ్చిపెడుతోంది. గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు కొంతమంది లో అహంకారం కూడా పెరిగి ఆ అహంకారం తో అందుబాటులో ఉన్న సామాజిక పరిజ్ఞానాన్ని మానవ మనుగడ కంటే మానవ తప్పిదాల వైపు ఎక్కువగా ప్రభావితం చూపుతున్నాయి. దీనికి స్వార్థం మితిమీరిన ఆశ ఎక్కువ అవ్వడం చట్టాన్ని లెక్కచేయకుండా ఆర్థిక ప్రయోజనాల ను ఆశించి అధినేతలు ఒకటి చెబితే అధికారులు వంద తప్పులు చేసే స్థాయికి దిగజారి పోయారు. దేశంలో కానీ రాష్ట్రంలో ఎన్నో కేసులు చూస్తే మొదట్లో అమ్మో అనిపించినంత ఆ తరువాత అబ్బే అనిపించే స్థాయికి వచ్చి అవన్నీ తప్పుడు కేసులని కొట్టేసి పరిస్థితి ఏర్పడింది.వైఎస్సార్ హయాంలో పనిచేసిన ఐఎఎస్ లు జైలుకు వెల్లి బెయిల్ పై వచ్చి చివరికి కడిగిన ముత్యం లా బైటికి వచ్చారు. అదే విదంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నాడు జైలుకు పంపించారు ఆ కేసుల్లో ఆయన్ను నిర్దోషిగా తేల్చిచెప్పింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.ఇలా ఎన్నో కేసులు రాజకీయ వైరుధ్యాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న లోపాలను చూసుకుని అభాసుపాలు చేయడం నాలుగో సింహానికి నేతితో పెట్టిన విద్య లాగా తయారయినదని చెప్పక తప్పడం లేదు.నిన్న మొన్న ముంబయి నటి కాదంబరి కథ అలానే అప్పటి ప్రభుత్వం దోషి అంటే ఇప్పటి ప్రభుత్వం నిర్దోషి అని ఇంకొంత మందిని అరెస్ట్ చేసి వైసీపీ పార్టీకి అంతకట్టింది. ఆ కేసులో దేశంలో అత్యున్నత స్థాయి ఉన్న ఐపిఎస్ లు అభాసుపాలు అయ్యి సస్పెన్షన్ కు గురికావడం జరిగింది. అదే అయేషా మీరా కేసు ,కోడి కత్తి కేసు లు ఇలా అనాధిగా అర్థం కాని స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కేవలం పోలీసుల వైఫల్యం ,కొంతమంది పోలీసుల అసమర్థ విధానాలతో జరిగుతున్నాయని ప్రజల్లో బలమైన వాదన వినిపిస్తోంది. నిన్న మొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై పెదవి విరిచారు.కూటమి ప్రభుత్వం లో ఉన్న కీలక నేత కూడా నాలుగో సింహం పై నడివీదిలో అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా పోలీసుల వైఫల్యం కాక ఇంకేదయిన అని చెప్పాల అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. నచ్చిన పని చేస్తే అధికార పార్టీ అబ్బా అంటుంటే అవతలి పార్టీ వారు అబ్బే అంటున్నారు. నిజంగా వృత్తికి న్యాయం చేస్తే ఇన్ని విమర్శలు ఎందుకు వస్తాయనేది డాలర్ల ప్రశ్న. ఒక పేదవాడికి న్యాయం అందించడం లో అలసత్వం వహించే వారికీ ఇలానే జరగాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికయిన ప్రభుత్వ పెద్దలు ఆలోచించి న్యామన్నది నడివీధిలో అంగడి సరుకుగా చేసే విధానానికి స్వస్తిపలికి అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థ ను అందరికి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నారు సామాన్య ప్రజలు.