క్రీడలుజిల్లాకు మరిన్ని పతకాలు తీసుకు రావాలి
జిల్లాకు మరిన్ని పతకాలు తీసుకు రావాలి
- అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ ఆకాంక్ష
- “స్కేటింగ్”లో రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంపీ అభినందన ప్రజాభూమి, అనంతపురము
జిల్లాకు మరిన్ని పతకాలు తీసుకు వచ్చి జిల్లాకు పేరు తేవాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. స్కేటింగ్ క్రీడలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన అనంతపురం విద్యార్థులను బుధవారం ఎంపీ అభినందించారు. కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ క్రీడా పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచి పథకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వీట్స్ తినిపించి అభినందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులను సత్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ లో మరింత మంచి ఫలితాలు సాధించాలని, వారిని ప్రోత్సహించాలని, క్రీడాకారులకు అవసరమైన వసతులు అందించి, అనంతపురం జిల్లాకు మరిన్ని పతకాలు సాధించేందుకు తమ పూర్తి సహాయాన్ని అందిస్తామన్నారు.
పతకాలు సాధించిన క్రీడాకారుల వివరాలు
- పద్మావతి : 1 రజిత పతకం
- హీన: 1 రజిత, 1 కాంస్య పతకాలు
- హంజా హుస్సేన్: 2 స్వర్ణ, 1 రజిత పతకాలు
- కాకర్ల హనీష్ కుమార్: 2 కాంస్య పతకాలు
- ప్రీతి: 1 కాంస్య పతకం
- స్పెషల్ క్యాటగిరీ విభాగంలో.. :
- సుజిత్ హార్దిక్: 2 రజిత పథకాలు
- హేమంత్: 1 రజిత పతకం.
క్రీడాకారులను ప్రోత్సహించిన కోచ్‌లు నాగేంద్ర కుమార్, అంజి, అనిల్ ను, వారి తల్లిదండ్రులు, కార్యదర్శులు రవి బాల, అనిల్ కుమార్ లను కూడా ఎంపీ అభినందించారు. జిల్లా క్రీడల విభాగం అధికారులు కూడా విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, అనంతపురం జిల్లాను రాష్ట్రస్థాయిలో నిలిపి, జిల్లా అధికారులకు, నాయకులకు మంచి పేరు తీసుకురావాలని ఎంపీ కోరారు.