కామవరపుకోట:ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావికంపాడు నందు స్వతంత్ర భారత దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి జన్మదినం సందర్బంగా బాలల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెహ్రు చిత్రపఠానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు.విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించారు. ఎంతో ఆనందంతో హర్షాతిరేకం వెలిబుచ్చారు.వ్యాసరచన, వక్తృత్వం, ఆటలు పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు బహమతులు అందించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసారు.కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి భీమరాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.