ఒంటిమిట్ట:
గత కొన్ని దశాబ్దాలుగా ఒంటిమిట్ట మండలంలో ఉన్న విద్యుత్ డివిజనల్ ఆఫీస్ కడపకు తరలి వెళ్లకుండా ఇక్కడే ఉంచాలని కోరుతూ అమరావతిలోని
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసిన ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ క్లస్టర్ ఇంచార్జ్ ఎస్వీ రమణ మంత్రిగారికి విన్నవించుకున్నారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ రెండో భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం స్టేట్ ఫెస్టివల్ గా విరజుల్లుతుంది అలాంటి సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులకి ఇబ్బంది జరగకుండా స్థానికంగా డివిజనల్ ఆఫీస్ అందుబాటులో ఉంటే ప్రజలకు మరియు రైతులకు అందుబాటులో ఉంటుంది అని మంత్రి గారికి విన్నవించుకున్నారు అలాగే ఒంటిమిట్ట మండలం స్థానికంగా ఉండే విద్యుత్ డివిజనల్ ఆఫీస్ కడపకు తరలిపోకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గారిని కోరారు ఒంటిమిట్ట మండలంలో విద్యుత్ డివిజనల్ ఆఫీస్ కడపకు తరలిపోవడంతో స్థానిక ప్రజానీకానికి ఇబ్బంది జరుగుతుంది.ఈ డివిజనల్ ఆఫీస్ ఒంటిమిట్ట మండలం మరియు సిద్ధవటం మండలాలకు సంబంధించిన ప్రతి పేద ప్రజలు రైతులకి అందుబాటులో ఉంటుంది కావున ప్రజల పక్షాన ఒంటిమిట్ట తల్లేసిన పార్టీ విద్యుత్ శాఖ మంత్రి గారికి తెలుగుదేశం పార్టీ ద్వారా తెలియజేసినారు. మంత్రిగారు స్పందించి సిఎండి సంతోష్ రావు గారికి ఫోన్ ( చరవాణి)ద్వారా మంత్రిగారు ఈ డివిజనల్ ఆఫీసు తరలిపోకుండా స్థానికంగానే ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రిగారు సీఎండీకి తెలిపినారు. వెంటనే మంత్రిగారు విద్యుత్ సిఎండి సంతోష్ రావు గారికి ఫ్యాక్స్ ద్వారా సమస్యను పంపినారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ మరియు క్లస్టర్ ఇంచార్జ్ ఎస్వి రమణ, యువ నాయకుడు ముద్దా కృష్ణారెడ్డి, బోడే రమణ,ఓబుల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.