ఒంటిమిట్ట:
రెండవ అయోధ్యగా పిలవబడే శ్రీ ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణలు మంగళ వాయిద్యాలు నడుమ శుక్రవారం నాడు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ఆలయ పర్యవేశవులు టిటిడి అధికారుల సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీతమ్మ, రాములవారికి పట్టు వస్త్రాలు పుష్ప మాలికలు బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అర్చకులు ముందుగా భగవత్ అనుజ్ఞ,విశ్వసేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ,మధుపర్కం ,వస్త్ర సమర్పణ, కన్యాదానం జీలకర్ర బెల్లం, పూజలను శాస్త్రవేత్తగా నిర్వహించారు కార్తిక పౌర్ణమి వేల జరిగే జానకిరాముల పరిణయాన్ని కనులారా తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాయన ఆనందకరంగా జరిగిన కళ్యాణోత్సవాన్ని చూసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు, జానకి రాముల కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు సీత అమ్మవారి జాకెట్టు కంకణాలను,అందజేశారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వీణ రాఘవాచార్యులు, అర్చకులు శ్రావణ, ఆలయ సిబ్బంది ప్రవీణ్ కుమార్ రెడ్డి,నాయక్, వినోద్ సిబ్బంది పాల్గొన్నారు.