కార్తీకదీపం దర్శనం శివ కేశవుల దర్శనం
శ్రీ ప్రతాప్ స్వామీజీ
రామచంద్రపురం
కార్తీక మాసంలో వెలిగించే దీపం, దర్శనం, అభిషేకం, దానం అత్యంత పవిత్రమైనవని, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు దీపోత్సవం చేస్తే శివ కేశవులని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని, ప్రతి సంవత్సరం కార్తిక మాస పౌర్ణమి రోజున యోగుల పర్వతంపై
సమస్త మానవాళి సుభిక్షం కొరకు కార్తీక మహా దిపోత్సవం* చేస్తున్నామని శ్రీ ప్రతాప్ స్వామీజీ అన్నారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని యోగుల పర్వతంపై కార్తీక దీపాన్ని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు . శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 1503 కిలోల ఆవు నెయ్యి,2007 మీటర్ల ఒత్తు, 6 అడుగుల రాగి ప్రమీదలో సుమారు 40 కిలోమీటర్లు కనిపించే మేరా కార్తీకదీపం ను వెలిగించారు . ఉదయం నుండి యోగుల పర్వతంపై ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామికి, శ్రీ సిద్దేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, కార్తీకేశ్వరుడు అయిన శ్రీ బాల సుబ్రహ్మణ్యం స్వామికి నాగదేవతలకు పూజలు చేశారు . ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు .యోగులు పర్వతం పైకి వచ్చే భక్తులకు దారి పొడుగునా త్రాగునీరు, పర్వతంపై నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ దీప దర్శనంతో అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానమని వెలుగు జ్యోతులతో నిత్యం భక్తిశ్రద్ధలతో ధర్మ మార్గంలో జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. ఈ కార్తీక దీపం కార్యక్రమంలో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.