Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుమూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం

మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం

తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం

టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు
తిరుమల:-తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ముఖ్య నిర్ణ‌యాలను టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు మీడియాకు వివ‌రించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణ‌యం తీసుకున్నామని తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. అలిపిరిలో దేవలోక్‌ సంస్థకు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అన్నప్రసాదంలో మరో ఐటమ్‌ను భక్తులకు వడ్డించాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.వైసీపీ ప్రభుత్వంలో శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన భూములు రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ స్థలంలో శారదా పీఠం నిర్మించిన భవనాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. పర్యటక శాఖకు కేటాయిస్తున్న 4 వేల దర్శనం టిక్కెట్లు రద్దు చేస్తునట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు
టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
-టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం-తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణ‌యం-తిరుప‌తిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం.-అలిపిరిలో టూరిజం కార్పోరేష‌న్ ద్వారా దేవలోక్ కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.-తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.-తిరుపతి స్థానికులకు ప్ర‌తి నెలా మొద‌టి మంగ‌ళ‌వారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం.- శ్రీ‌వాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశం.
-ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకోగా.. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చించనున్నారు.-నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అద‌నంగా మ‌రొక‌ ప‌దార్థాన్ని చేర్చేందుకు నిర్ణ‌యం.-వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీజీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.-తిరుమ‌ల‌లో గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద విశాఖ శ్రీ శార‌ద పీఠానికి చెందిన మ‌ఠం నిర్మాణంలో అవ‌క‌త‌వ‌క‌లు, ఆక్ర‌మ‌ణలు జ‌రిగిన‌ట్లు టీటీడీ అధికారుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భ‌వ‌నం లీజును ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం.-బ్ర‌హ్మోత్స‌వాలలో విశేష సేవ‌లు అందించిన ఉద్యోగుల‌కు గ‌త సంవ‌త్స‌రం ఇచ్చిన బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానాన్ని 10 శాతం పెంచాల‌ని నిర్ణ‌యం.-త‌ద్వారా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు రూ.7,535 బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానం.-శ్రీ‌వారి ఆల‌యంలో లీకేజీల నివార‌ణ‌కు, అన్న ప్ర‌సాద కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ఈ ప‌నులు ఉచితంగా చేయ‌నున్న టీవీఎస్ సంస్థ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article