Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంభక్తులతో కిలకల్లాడిన పాతగయ మహాపుణ్యక్షేత్రం

భక్తులతో కిలకల్లాడిన పాతగయ మహాపుణ్యక్షేత్రం

పిఠాపురం

కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం స్వయంభు శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయా మహా పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం మూడవ సోమవార పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే అశేష భక్త జనం ఆలయానికి చేరుకుని పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలను ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లకు అచంచల భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాది షోడశోపచార పూజలు నిర్వహించి హర హర మహాదేవ శంభో శంకర అంటూ వరణామ స్మరణ చేస్తూ ప్రదక్షిణాలు భావించి స్వామి అమ్మవార్లను తనివి తేరా దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించారు.
ప్రదోషకాల సమయంలో ప్రత్యేక దీపాలంకృతమైన సేవా కార్యక్రమంలో భాగంగా శివలింగాకృతిలో అమర్చిన కార్తీక దీపాలను వెలిగించి జయ జయ శంకర హర హర శంకర అంటూ హరినామస్మరణ చేస్తూ ప్రదక్షిణాలు చేశారు. ఈ కార్యక్రమాలు కనులారా వీక్షించిన జన్మ చరితార్థమవుతుంది అన్న రీతిలో జరిగిన ఆ కార్యక్రమాలు ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article