కమ్మని గొంతునిచ్చావ్ ..కాటికి పంపావ్..
పాటకోసం వెళ్తుంటే పైలోకా నికి తీసుకెళ్లావ్..
ఆ పసిపాప కు పావనిని దూరం చేశావ్..
ఏది జననం.. ఏది మరణం..
ఎందుకింత పితలాటకం..
ఎదిగే వయస్సులో ఎన్ని కష్టాలు పెడతావో..
అంతా నువ్వే అనుకుంటే అంతా మాయ చేస్తావ్..
చక్కని గొంతు నిచ్చావ్ ..
చల్లగా నీ ఒడిలోకి చేర్చుకుంటావ్ ..
నీ మాయలో మనుషుల జీవితాలతో ఆడుకుంటావ్ ..
ఆ గొంతునెందుకు నొక్కేసావో ..
ఆ కుటుంబానికి దిక్కెవరు…
(కృష్ణ సింధు,)
దేవుడు నాటకంలో అంతా పాత్రదారులే.ఆ నాటకం లో ఎవరు పూర్తిగా పాత్ర పోషిస్తారో తెలియదు.ఏవరిని నిష్క్రమిస్తారో తెలియదు.ఆ జగన్నాటకం లో ఎవరు ఏ విదంగా బలి అవుతారో తెలియని వైచిత్రి.విధి నాటకంలో విగత జీవులుగా చేస్తుంటే విల విల లాడి పోతుంది ఆ ఇల్లు. ఈ రోజు నా స్నేహితురాలు గాయని పావని గాఢ నిద్రలోకి వెళ్లి అందరికి అందనంత దూరంగా ఆ దేవుడు తీసుకెళ్లాడని ఆవేదనతో అందిస్తున్న అక్షరాలు… జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఓ గాయనిగా రాణిస్తున్న తరుణంలో ఆ కళామాతల్లి ఓర్వలేక పోయిందో లేక ఎవరి కళ్ళకు కుళ్లు కలిగిందో ఆ కలామ తల్లి బిడ్డ కానరాని లోకాలకు వెళ్ళిపోయింది కళారంగం లో ఇప్పుడిప్పుడే కొత్త కొత్త అవకాశాలు వస్తుంటే ఆ కుటుంబం కోసం కసికూన ను ఒంటరిగా వదలలేక తప్పని పరిస్థితుల్లొ కన్నీటిని దిగమింగుకుని తన కంటాన్ని వినిపిస్తూ అందరి కళ్ళల్లో ఆనందాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న అతి తక్కువ కాలంలో అందరికి దూరం చేసాడు ఆ దేవుడు. అవకాశం వచ్చిందని అసలు సమయం కూడా చుడుకోకుండా సూర్యడు ఉదయించి ఉదయించక ముందే తన పతితో పాటలు పాడుటకు బైటికి వస్తుంటే మృత్యువు వెంటబడిండి.అయ్యో అని గట్టిగా కేకలు వేసే లోపు అసువులు బాసింది ఆ బంగారుతల్లి పావని.ఈ దుస్సంఘటన బుధవారం గుంటూరులో జరగడం ఆత్యంత బాధాకరం. గాయని పావని ఘోర ప్రమాదం లో చనిపోవడం కలా రంగం నివ్వెర పోయింది. తన భర్త కృష్ణ తో బైకు పై పాటలు పాడేందుకు పోతున్న సమయంలో వెనుక నుంచి ఓ ప్రవేటు కళాశాల బస్సు ఢీకొట్టడంతో గాయని పావని అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆమె భర్త తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతూ ఉన్నాడు. వీరికి 14 నెలల పాప ఉంది.ఆ తల్లి మరణం తో ఆ చిన్నారి జీవితం అస్తవ్యస్తంగా తయారైనది చెప్పాలి. దేవుడు ఆడిన వింత నాటకం లో ఆ కుటుంబం పూర్తిగా విషాదం లో మునిగిపోయింది. కళారంగం మొత్తం తీవ్ర మనోవేదనకు గురైనది.ఆమె భౌతిక ఖాయం చూడడానికి ఆమె ఆత్మీయులు అనేక ప్రాంతాల నుండి కళాభిమానలు కదిలి రావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయవిధారకర సంఘటన చూసి అందరి హృదయాలు ఆవేదనతో తల్లడిల్లి పోయాయి.