ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో గురువారం అభయాంజనేయ స్వామి మూలవిరాట్ విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. 3 రోజులపాటు గ్రామంలో పెద్దఎత్తున వివిధ రకాల పూజాది కార్యక్రమాలు గ్రామస్తుల సహకారంతో పురోహితులు బ్రహ్మశ్రీ రఘునాథ శాస్త్రి వారి సహాయక బృందం వేదమూర్తులు భరత్ కుమార్, సురేష్ శర్మ, రవితేజ, రాజేష్ శర్మలు వివిధ రకాల యజ్ఞ్యాలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రాంగణంలోనే ఆదిత్యాది నవగ్రహాల దేవతలు, ధ్వజప్రతిష్ట, గణపతి, శిరిడి సాయినాథ ప్రతిష్ట, శిఖర కళాశస్థాపన ప్రతిష్ట మొదలగు మహోత్సవములు పెద్దఎత్తున నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి భక్తులు, పలుశాఖల ఉన్నతాధికారులు, అనధికారులు, రాజకీయవేత్తలు భారీ ఎత్తున వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు.