జగ్గంపేట
కార్తిక మాసం పురస్కరించికొని మండల కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న శ్రీరామ్ నగర్ రామాలయం వద్ద ఆదివారం ఉదయం మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామాలయం వద్ద కార్తీక మాసం ప్రారంభం నుంచి 12 రకాల నదిలో జలాలతో శివపార్వతులకు అభిషేకం నిర్వహించి మట్టి పుట్టతో శివలింగం తయారుచేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరంతో 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విధంగా పూజలు చేయడం వల్ల దేశంలో రైతులు పాడిపంటలు పండి సుభిక్షంగా ఉంటారని , ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా మెలుగుతారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆదివారం సాయంత్రం శ్రీరామ్నగర్ లో జమ్మి చెట్టు వద్ద శివపార్వతులకు పూజలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.