Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలువిశాఖ కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి పాదయాత్రకు జగ్గంపేటలో ఘన స్వాగతం

విశాఖ కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి పాదయాత్రకు జగ్గంపేటలో ఘన స్వాగతం

ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన టిటిడి పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట

చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు నుండి సత్య శీలుడుగా బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే విశాఖపట్నం నుండి భద్రాచలం శ్రీ రాముల వారి చెంతకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్న విశాఖపట్నం 69వ కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి మొక్కులు చెల్లించే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేసుకుంటూ ఆదివారం మధ్యాహ్నం కు జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేటలో ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించి పాదయాత్ర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు రుచి హోటల్స్ అధినేత పాలచర్ల నాగేంద్ర చౌదరి గోవింద్ రెడ్డి ని సత్కరించి వారి మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో వసతి, భోజనం వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి రాక్షస పాలల్లో వెజినరీ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు ను తప్పుడు కేసులు బనాయించి అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేసినప్పుడు ఆ రాములవారిని కోరుకున్నదొక్కటే చంద్రబాబు సత్య శీలుడుగా బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే విశాఖపట్నం లో గల తుంగలం రామాలయం నుండి భద్రాచలం పాదయాత్ర చేసుకుంటూ వస్తానని మొక్కుకున్నానని అందులో భాగంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నానని నాకు ఇంతటి స్వాగతాన్ని ఇచ్చి సత్కరించిన పెద్దలు జ్యోతుల నెహ్రూ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అదే విధంగా మాకు వసతి కల్పించిన నాగేంద్ర చౌదరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణి బాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, బద్ది సురేష్ వేములకొండ జోగారావు, మండపాక అప్పన్న దొర, ఎ వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article