తూర్పు కాపులంతా ఐక్యంగా ఒకే సంఘంగా ఏర్పడాలి, ఎకరం స్థలంలో కళ్యాణ మండపం నిర్మిస్తా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట
స్థానిక గుర్రంపాలెం రోడ్ లో గల పామాయిల్ తోటలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు పెద్దలు ఆటపాటలతో, తిరునాళ్లు తలపించేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతుల నెహ్రూను తూర్పు కాపు సంఘం పెద్దలు ఘనంగా గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తూర్పు కాపులంతా ఒకే సంఘం గా ఉండాలని జగ్గంపేటలో రెండు సంఘాలు ఏర్పడడం మంచిది కాదని ఐక్యమక్యంగా ఒక్కటే సంఘం గా ఉండాలని దీనికి జగ్గంపేట పెద్దలు అప్పలరాజు, భద్రం చొరవ తీసుకుని ఒకే సంఘంగా ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఒక ఎకరం స్థలంలో వచ్చే సంవత్సరం వన సమారాధన ఏర్పాటు చేసుకునే సమయానికి కళ్యాణ మండపం నిర్మిస్తానని ఉత్తరాంధ్ర జిల్లాలకు పరిమితమైన ఓబీసీ రిజర్వేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న తూర్పు కాపులకు కూడా వర్తించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎమ్మెల్యేలు అందరం కలిసి మాట్లాడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముదీ నారాయణస్వామి, మజ్జి పద్మావతి, గెడ్డం పెద్దకాపు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్పీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జీను మణి బాబు, వేములకొండ జోగారావు, జగ్గంపేట తూర్పు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు పిలా మహేష్, అధ్యక్షులు తాండ్రోతు నూకరాజు, సెక్రెటరీ కరుముజ్జి రామకృష్ణ, ట్రెజరర్ ప్రేమ స్వరూప్ బుజ్జి, జాయింట్ సెక్రెటరీ నండ్ల చిరంజీవి, వైస్ ప్రెసిడెంట్ కోరాడ బాబురావు, మండల తూర్పు కాపు సంగం మండల అధ్యక్షులు కోడ్రుతూ పై డియ్యా తూర్పు కాపు సంఘం పెద్దలు పాల్గొన్నారు.