Sunday, January 12, 2025

Creating liberating content

తాజా వార్తలురాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబుకు ఘన సన్మానం

రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబుకు ఘన సన్మానం

ముఖ్యఅతిథిగాహాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)

జగ్గంపేట

ఎన్ ఎఫ్ సి ఎల్ రోడ్ లో గల సత్య భాస్కర స్కూల్ ఆడిటోరియంలో కాకినాడ ఆర్యవైశ్య సంఘం వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొండబాబు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన శుభ సందర్భంలో కాకినాడ ఆర్యవైశ్య ప్రముఖులందరూ కొండబాబు మాధురి ఆండాళ్ దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికా అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ కాకినాడ జిల్లా నుంచి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ లో కొండబాబుకు స్థానం కల్పించి ఆర్యవైశ్యులందరికీ పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కు కుటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఫార్మసీ కాలేజెస్ అధినేత పి కనకరాజు, వంకాయల లక్ష్మణ్ మూర్తి, లింగమల్లు కృష్ణమూర్తి, వెత్సవరలక్ష్మి, చెన్నా మాధవరావు, బాదం కృష్ణమూర్తి, దంగేటి నరసింహ ప్రసాద్ , భవిరిశెట్టి నాగదేవి, ఆకే వీర వెంకటేశ్వరరావు, వెత్స ఆనంద్, గుండు లలిత ఆర్యవైశ్య ఆఫీసల్స్, ఆర్యవైశ్య గ్రాడ్జెట్స్, ఆర్యవైశ్య మహిళా మండలి ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article