Wednesday, November 27, 2024

Creating liberating content

క్రీడలు295 ప‌రుగుల తేడాతో టీమిండియా గెలుపు

295 ప‌రుగుల తేడాతో టీమిండియా గెలుపు

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన‌ తొలి టెస్టులో భార‌త జ‌ట్టు ఘ‌న‌ విజ‌యం సాధించింది. 534 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 238 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో టీమిండియా 295 ర‌న్స్ తేడాతో గెలిచింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 12/3తో నాలుగో రోజు ఆట కొన‌సాగించిన ఆసీస్ మ‌రో ఐదు ప‌రుగులు జోడించి ఉస్మాన్ ఖ‌వాజా వికెట్‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్ ద్వ‌యం కొద్దిసేపు భారత బౌల‌ర్ల‌ను నిలువరించింది. ఐదో వికెట్‌కు ఈ జోడి 62 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించింది. అయితే, మ‌హ్మ‌ద్‌ సిరాజ్ ఓ అద్భుత‌మైన బంతితో స్మిత్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్ర‌మంలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత‌ మిచెల్ మార్ష్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రిగెత్తించాడు. 89 ప‌రుగులు చేసి సెంచ‌రీ వైపు దూసుకెళ్తున్న హెడ్‌ను బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో మార్ష్‌, హెడ్ నెల‌కొల్పిన 82 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవ‌డంతో ఆసీస్ ఓట‌మి ఖాయ‌మైంది. చివ‌రికి ఆతిథ్య జ‌ట్టు 58.4 ఓవ‌ర్ల‌లో 238 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే వాషింగ్ట‌న్ సుంద‌ర్ 2, హ‌ర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 8 వికెట్లతో (మొద‌టి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3) రాణించిన కెప్టెన్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article